టాటా నెక్సాన్‌ విద్యుత్‌ వాహనంపై దిల్లీలో రాయితీ తొలగింపు - Discount on Tata Nexan electric vehicle in Delhi
close

Updated : 02/03/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా నెక్సాన్‌ విద్యుత్‌ వాహనంపై దిల్లీలో రాయితీ తొలగింపు

దిల్లీ: టాటా నెక్సాన్‌ విద్యుత్‌ వాహనాలపై ఇస్తున్న రాయితీని తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నిలిపేస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపిందని, అయితే ఆ విధంగా ఈ వాహనం నడవడం లేదని పలు ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఫిర్యాదుల పరిశీలకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించినట్లు దిల్లీ సర్కారు పేర్కొంది. ఈ కమిటీలో టాటా మోటార్స్‌ నుంచి కూడా ఒక సభ్యుడు ఉన్నారు. ఈ కమిటీ నిర్ణయం వెలువడేంత వరకు టాటా నెక్సాన్‌ విద్యుత్‌ వాహనాలపై రాయితీ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు రవాణా విభాగం వివరించింది. వినియోగదార్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతామని, ఈ ఫిర్యాదులు రావడం దురదృష్టకరమని టాటా మోటార్స్‌ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని