సాధార‌ణంగా బీమా వ‌ర్తించ‌ని వ్యాధులు - Diseases-not-covered-under-health-policies
close

Published : 27/12/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాధార‌ణంగా బీమా వ‌ర్తించ‌ని వ్యాధులు

బీమా పాల‌సీ తీసుకోక‌ముందు ముందే ఉన్న కొన్ని వ్యాధులకు సాధ‌ర‌ణంగా 24 నుంచి 48 నెల‌ల త‌ర్వాత చికిత్స‌కు హామీ అందిస్తుంది. అంత‌కుముందు వ్యాధులకు మీకు చికిత్స అవ‌స‌ర‌మైతే సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసుకోవాల్సి ఉంటుంది. చాలావ‌ర‌కు బీమా పాల‌సీలు తీసుకున్న 30 రోజుల వ‌ర‌కు ఎలాంటి వైద్య ఖర్చులను చెల్లించవు . కొన్ని ర‌కాల ఖ‌ర్చుల‌కు బీమా పాల‌సీ క‌వ‌రేజ్ ఉండ‌దు. బీమా సంస్థ‌లు క‌ళ్ల‌ద్దాలు, కాంటాక్ట్ లెన్స్, వినికిడి యంత్రాలు, వాక‌ర్స్‌, డెంట‌ల్ చికిత్స వంటి వాటికి క‌వ‌రేజ్ అందించ‌వు. సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య బీమా పాల‌సీలు ఈఎన్‌టీ సంబంధిత వ్యాధుల‌కు, హెర్నియా, వృద్ధ వ‌య‌సులో వ‌చ్చే వ్యాధుల‌కు బీమా కవరేజ్ అందించకపోవచ్చు. అల్స‌ర్‌, సైన‌సైటీస్, పోష‌కాహార లోపం వ‌ల‌న క‌లిగే వ్యాధులు వంటి వాటికి కూడా వ‌ర్తించ‌వు. హెచ్ఐవీ వంటి న‌యంకాని రోగాల‌కు బీమా పాల‌సీ ఉండ‌దు, డెంట‌ల్ స‌ర్జ‌రీలు (ప్ర‌మాద‌వ‌శాత్తు సంభ‌వించిన‌వి కాకుండా), కాస్మ‌టిక్ స‌ర్జరీలు కూడా క‌వ‌రేజ్ అందించ‌వు.

సాధారణ ప్ర‌జ‌లు బీమా సంస్థ‌లు ఉప‌యోగించే పేర్ల‌ను అర్థం చేసుకోలేక‌పోతున్నారు. పాల‌సీ తీసుకున్న‌వారు ఏ వ్యాధుల‌కు బీమా వ‌ర్తించ‌దో తెలియ‌క క్లెయిమ్ చేస్తుంటే అవి తిర‌స్క‌రిస్తున్నారు. బీమా సంస్థ‌లు ఎందుకు ఇలాంటి కొన్ని వ్యాధుల‌కు క‌వ‌రేజ్ అందించ‌వంటే…కొన్ని వ్యాధుల‌ను బీమా హామీ నుంచి మిన‌హాయించ‌డం ద్వారా సంస్థ‌లు రిస్క్ తగ్గించుకుంటాయి. కొన్ని ర‌కాల శస్ర్త చికిత్స‌ల‌కు బీమా కవరేజ్ రెండేళ్ల త‌ర్వాత ఉంటుంది.

పన్ను పరంగా కూడా…
ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద రూ. 25వేల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. మీ తల్లిదండ్రులకు కూడా బీమా పాలసీ తీసుకుంటే అదనంగా మరో రూ. 25వేల వరకూ (సీనియర్‌ సిటిజన్లయితే రూ. 50వేలకు) మినహాయింపు పొందవచ్చు. మీరు సీనియర్ సిటిజన్లు అయి ఉండి , మీ తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్లు అయితే మొత్తం రూ . 1 లక్ష వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

పాలసీదారుల సమస్యలు− ఫిర్యాదులు నమోదు:
అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మ‌న‌ల్ని ఆర్థిక‌ప‌రంగా ఆదుకుంటుంద‌నే ఉద్దేశంతో బీమా పాల‌సీ తీసుకుంటాం. బీమా కంపెనీ సేవ‌ల‌తో మ‌నం సంతృప్తి చెంద‌క‌పోతే ఫిర్యాదు చేసే హ‌క్కుంది. స‌రైన పాల‌సీ తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో సమస్య ఎదురైతే ఫిర్యాదు చేసే విధానం తెలుసుకోవ‌డమూ అంతే ముఖ్యం. ఒక‌వేళ ఫిర్యాదుకు కంపెనీ నుంచి స‌రైన స్పంద‌న రాక‌పోతే దాన్ని ఉన్న‌త శ్రేణుల‌కు ఫిర్యాదు చేయ‌డం తెలుసుకుని ఉండ‌టం అవ‌స‌రం.
ఐఆర్‌డీఏకి ఫిర్యాదు…

టోల్‌ ఫ్రీ నంబరు 155255 లేదా 1800 425 4732. సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ సంప్రదించవచ్చు.
complaints@irda.gov.in కి ఈ-మెయిల్‌ చేయడం ద్వారా
ఫిర్యాదును నేరుగా లేదా కొరియర్‌ రూపంలో పంపేందుకు చిరునామా:
వినియోగదారుల సేవా విభాగం
ఐఆర్‌డీఏ,
Sy No. 115/1, Financial District,
Nanakramguda,Gachibowli,
Hyderabad, Telangana - 500032

ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐజీఎమ్‌ఎస్‌- https://igms.irda.gov.in/ ) ద్వారా ఫిర్యాదును నమోదు చేయడం…

అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు…
15రోజులలోగా మీ ఫిర్యాదుకు స్పందన రాకపోయినా, వచ్చిన స్పందన తో మీరు సంతృప్తి చెందకపోయినా బీమా అంబుడ్స్‌మన్‌ను ఈ కింది చిరునామా లో సంప్రదించవచ్చు:

6-2-46, 1st floor, “Moin Court”, Lane Opp. Saleem Function Palace,
A. C. Guards, Lakdi-Ka-Pool, Hyderabad - 500 004.
Tel.: 040 - 67504123 / 23312122
Email: bimalokpal.hyderabad@ecoi.co.in


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని