డిస్నీ+ హాట్‌స్టార్‌ పథకాల ధరల పెంపు: ఎయిర్‌టెల్‌ - Disney plus Hotstar plans price hike Airtel
close

Published : 17/09/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిస్నీ+ హాట్‌స్టార్‌ పథకాల ధరల పెంపు: ఎయిర్‌టెల్‌

దిల్లీ: డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి వచ్చే మొబైల్‌ ప్రీపెయిడ్‌, ఇంటి బ్రాడ్‌బ్యాండ్‌ పథకాల ధరలు పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 28 రోజుల కాలవ్యవధి కలిగిన ప్రీపెయిడ్‌ మొబైల్‌ పథకాల ధరను రూ.448 నుంచి రూ.499; 56 రోజుల వ్యవధి ధరను రూ.599 నుంచి రూ.699; ఏడాది కాలవ్యవధి ప్యాక్‌ ధరను రూ.2698 నుంచి రూ.2798కు ఎయిర్‌టెల్‌ పెంచింది.


2026కు దేశీయ డ్రోన్‌ పరిశ్రమ రూ.15,000 కోట్లకు
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

దిల్లీ: భారత డ్రోన్‌ పరిశ్రమ 2026 నాటికి రూ.15,000 కోట్ల టర్నోవర్‌ సాధించే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంతో ఈ రంగానికి ఊతం లభిస్తుందని, గత నెలలో అమల్లోకి తెచ్చిన సరళీకృత నియమాలు కూడా ఈ రంగ వృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎల్‌ఐ పథకం కింద డ్రోన్లు, డ్రోన్‌ పరికరాల కోసం 3 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.120 కోట్లను కేంద్రం కేటాయించింది. డ్రోన్‌ పాలసీ (నియమావళి), డ్రోన్‌ పీఎల్‌ఐ పథకంతో డ్రోన్‌ తయారీ కంపెనీల టర్నోవర్‌ వచ్చే మూడేళ్లలో రూ.900 కోట్లకు చేరుతుందని సింధియా వివరించారు. ప్రస్తుతం ఈ కంపెనీల టర్నోవర్‌ సుమారు రూ.80 కోట్ల వరకు ఉందని తెలిపారు. డ్రోన్‌ పరిశ్రమలోని హార్డ్‌వేర్‌ (డ్రోన్‌ తయారీ సంస్థలు), సాఫ్ట్‌వేర్‌, సర్వీస్‌ డెలివరీ మొత్తం వాల్యూ చైన్‌ 2026 నాటికి 180 కోట్ల డాలర్లకు (రూ.12,000-15,000 కోట్లు) చేరుకుంటుందని పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని