చిన్నవాటికే క్లెయిమ్ చేయొద్దు
వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిం చేసుకోవడం సహజం. అయితే వాహనానికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా చీటికి మాటికి బీమా క్లెయిం చేసుకోవడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయం. రూ.10 వేల వరకు వాహనానికి నష్టం వాటిల్లితే వాహనదారులు సెటిల్మెంట్ చేసుకునేందుకే మక్కువ చూపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలిసులకు ఫిర్యాదు చేస్తే జనరల్ డైరీ (జీడీ) లో నమోదు చేస్తున్నారు. అది కూడా క్లెయిమ్ చేసుకునేంత నష్టం జరిగితే ఎంటర్ చేయడం మంచిది. వాహన రంగ నిపుణుల ప్రకారం చిన్న చిన్న ప్రమాదాలకు సెటిల్మెంట్ చేసుకోవడమే మంచిది. బీమా క్లెయిమ్ చేసుకోవాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో రూ.500 తో సరిపెట్టుకునే ప్రమాదం అయిన జీడీలో ఎంట్రీ చేస్తున్నారు. ఇది తదుపరి పాలసీ పునరుద్ధరణకు ఆటంకం కావొచ్చు. తదుపరి పాలసీని పునరుద్ధరించినప్పుడు మీరు ఎన్ని సార్లు బీమా క్లెయిం చేసుకున్నారన్న విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటారని నిపుణులు అంటున్నారు. అనుకోని సంఘటనల వల్ల ప్రమాదాలు జరిగి వాహనం నడవలేని స్థితిలో వాహన బీమా మనకు రక్షణనిస్తుంది. అయితే ప్రతీ చిన్న ప్రమాదానికి ముఖ్యంగా వాహన పనితీరుపై ప్రభావం చూపనివాటికి కూడా తరచుగా బీమా క్లెయింలు చేసుకోవడం మంచిది కాదు. ఇందువల్ల మరమ్మత్తుల సందర్భంలో డబ్బులు చెల్లించాల్సి రావడమే గాకుండా, నోక్లెయిం బోనస్‌పైనా ప్రభావం పడుతుంది. నో క్లెయిం బోనస్ పై ప్రభావంతో బీమా పునరుద్ధరణ సమయంలో ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు.
వినియోగదారులు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, క్లెయిం చేసుకునే సందర్భాల్లో బీమా పాలసీలలో మీ వంతుగా చెల్లించే సొమ్ము చాలా వాహన పాలసీలలో అధికంగా ఉండొచ్చు లేదా మినహాయించుకునే రకంగా ఉండొచ్చు. దీంతో చిన్న చిన్న మరమ్మత్తుల వేళ మీకు తక్కువ ప్రయోజనం లభించే వీలుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కసారి క్లెయిం చేసినా మీ నో క్లెయిం బోనస్ సున్నాకి చేరే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న మరమ్మత్తులకు కాకుండా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే బీమా క్లెయిం కోసం దరఖాస్తు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఉదాహరణకు, మీరు క్లెయిం చేసుకునే మొత్తం రూ.3 వేలు ఉండి, మినహాయించుకునే మొత్తం రూ.1000 ఉన్నట్లయితే, క్లెయిం చేసుకోవడానికి బీమా కంపెనీ మీకు చెల్లించాల్సిన మొత్తం రూ.2 వేలు. ఈ సందర్భంలో వినియోగదారుడు మొత్తం సొమ్మును క్లెయిం చేసుకోవడం లేదు అలాగే అతని నో క్లెయిం బోనస్ పైనా ప్రభావం పడుతోంది. నో క్లెయిం బోనస్‌తో పాలసీ పునరుద్ధరణ సమయంలో చెల్లించే ప్రీమియంలో 20-50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి చిన్న చిన్న మరమ్మత్తులకు క్లెయిం చేసుకోవడం మంచిది కాదు.
క్లెయిం చేసుకునేందుకు నో క్లెయిం బోనస్‌పై దాని ప్రభావాన్ని అంచనా వేసుకుని క్లెయిం చేసుకోవడం మరిచిపోవద్దు. చిన్న చిన్న క్లెయింలు వినియోగదారుల రిస్క్ స్థాయి పెరుగుతుంది. అలాగే పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. కాబట్టి ఈ తప్పులు చేయకూడదు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. నేను ఒక రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని, పెన్షన్ వస్తోంది. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాను. దీనికి స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన పన్ను ఎలా ఉంటుంది?
-
Q. ఏజెంట్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకోవడం వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక లాభం ఏమైనా ఉంటుందా?
-
Q. నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.