వేత‌నం పెంచ‌మ‌ని అడిగేందుకు సంకోచిస్తున్నారా?   - Do-not-hesitate-to-discuss-about-financials-with-your-employer-and-family
close

Updated : 02/07/2021 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేత‌నం పెంచ‌మ‌ని అడిగేందుకు సంకోచిస్తున్నారా? 

మీ బంధువులు అందరూ ఒక్క‌చోట చేరిన‌ప్పుడు మాట‌ల మ‌ధ్య‌లో ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? అని అడిగితే చెప్పేందుకు కొందరు చెప్పేందుకు బాగా ఇబ్బంది పడతారు. అదే విధంగా మ‌న బంధువుల‌కు, స్నేహితుల‌కు, రుణం ఇచ్చిన‌ప్పుడు తిరిగి అడిగేందుకు మొహ‌మాట‌ప‌డ‌తాం. చాలామంది త‌ల్లిదండ్రులు ఆర్థిక విష‌యాల‌ను ర‌హస్యంగా మాట్లాడుకుంటారు. పిల్ల‌లు కూడా అదే అలవాటుగా మార్చుకుంటారు. దీంతో డ‌బ్బు ఒక వ్యక్తిగ‌త విష‌యంగా, ర‌హ‌స్యంగానే మాట్లాడుకునేలా అలవాటు ప‌డిపోయారు.  కానీ, జీవితంలో డ‌బ్బు అనేది అవ‌స‌రమే కాదు చాలా కీల‌క‌మైన విష‌యం. మీ య‌జ‌మానితో, త‌ల్లిదండ్రుల‌తో, పిల్ల‌ల‌తో, కుటుంబ స‌భ్యుల‌తో, స్నేహితుల‌తో మాట్లాడేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఆ కష్టమైన డబ్బు సంభాషణలను ఎలా చర్చించాలో తెలుసుకోండి.

మీ సంస్థ య‌జ‌మానితో..

మీరు మ‌న‌సు సంతృప్తి కోసం ఉద్యోగం చేస్తున్న‌ట్లు చెప్పినా, వేత‌నం కూడా అందుకు ముఖ్య కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. కాబట్టి, మీరు వేత‌నం గురించి మాట్లాడటం అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఇది కొత్త ఉద్యోగం కోసం లేదా మీ వేత‌న పెంపు కోసం వార్షిక ప‌నితీరు గురించి చ‌ర్చించిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో త‌ప్ప‌క అడ‌గాల్సి ఉంటుంది.

మీరు ఎంత ఆశించవచ్చో అర్థం చేసుకోవడానికి  తోటివారితో మాట్లాడండి,  క‌చ్చితంగా మీరు ఆశించినంత ల‌భించ‌డం కొన్ని సంద‌ర్భాల్లో క‌ష్టం కావొచ్చు. కానీ మీకు ఉన్న నైపుణ్యాలు, సంస్థ‌కు మీ సేవ‌లు ఎంత అవ‌స‌రం, ఈ రంగంలో వేత‌నాలు ఎలా ఉన్నాయి అనే దానిని వారి దృష్టికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.   మీరు ఆశించిన‌దానికంటే వారు ఇచ్చేది చాలా త‌క్కువగా ఉన్న‌ప్పుడు మీకు త‌గిన మ‌రో మంచి ఉద్యోగాన్ని చూసుకోవ‌డం మేలు. కానీ,  ఎక్కువ ఆశ ప‌నికిరాదు. మీకు ఉన్న నైపుణ్యాల‌కు ఎంత సరిపోతుందో అంతే ఆశించాలి. ఉద్యోగ భద్రత అనేది క‌ష్టంగా మారిన ఈ త‌రుణంలో వేగంగా నైపుణ్యాల‌ను, పెంచుకుంటూ ప్రావిణ్యాన్ని సంపాదించుకొని దానికి త‌గినంత సంపాదించుకోవాలి.
త‌ల్లిదండ్రుల‌తో :
త‌ల్లిదండ్రుల‌తో ఆర్థిక విష‌యాల గురించి చ‌ర్చించేట‌ప్పుడు మీ సంభాష‌ణ సున్నితంగా ఉండాలి. సూటిగా ఉన్న విష‌యాన్ని చెప్పేయాలి. అప్పుడే మీపై ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రులు మీ ప‌రిస్థితిని అర్థం చేసుకొని ఎక్కువ‌గా ఆశించ‌కుండా దానికి త‌గిన‌ట్లుగా న‌డుచుకుంటారు. 
 మీరు మీ తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వారసత్వంగా ఏమి వస్తుందో తెలుసుకోవడమే కాదు, ఆర్థిక విష‌యాల్లో త‌ల్లిదండ్రుల‌ను భాగ‌స్వామ్యం చేయ‌డం అవ‌స‌రం. అయితే వారు దానిని అసౌక‌ర్యంగా భావిస్తే బ‌ల‌వంతం చేయ‌వ‌ద్దు. ఒక ఉమ్మడి కుటుంబాలలో, ఆర్ధిక విషయానికి వస్తే ఆదాయం, ఖర్చులు పంచుకోవాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి చ‌ర్చించ‌క త‌ప్ప‌దు. 
మీ భాగ‌స్వామితో:
ఏదైనా బంధం బ‌ల‌ప‌డ‌టానికి పారదర్శకత, పరస్పర విశ్వాసం ఉండ‌టం కీలకం. కానీ మ‌న దేశంలో భార్య‌భ‌ర్త‌ల్లో సాధార‌ణంగా భ‌ర్త ఆర్థిక విష‌యాల బాధ్య‌త‌ను తీసుకుంటాడు. దీంతో వారు ఆదిప‌త్యం చెలాయిస్తూ ఆడ‌వాళ్ల‌ను ఇంటికే ప‌రిమితం చేయ‌డం ఒక వార‌స‌త్వం రావ‌డం ఒక దుర‌దృష్టం అనే చెప్పుకోవాలి. దీంతో డ‌బ్బు విష‌యాల గురించి ఆడ‌వాళ్ల‌తో చ‌ర్చించ‌కుండా ర‌హ‌స్యంగా ఉంచ‌డం అల‌వాటుగా మారిపోయింది. ఇది ఒక పెద్ద స‌మ‌స్య‌గా చెప్ప‌వ‌చ్చు.  ఏదైనా అనుకోని సంఘ‌ట‌న యాక్సిడెంట్, జ‌బ్బు లేదా మ‌ర‌ణం సంభ‌వించిన‌ప్పుడు భాగ‌స్వామికి ఆర్థిక విష‌యాల గురించి తెలియ‌క‌పోవ‌డం అతి పెద్ద స‌మ‌స్యంగా మారుతుంది. దీంతో పాటు బంధంలో స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి.
అందుకే డ‌బ్బు విష‌యాలు ఇద్ద‌రు చ‌ర్చించుకోవ‌డం ముఖ్యం. ఒక‌రు సంపాదించి మ‌రొక‌రు సంపాదించ‌క‌పోయినా ఆర్థిక విష‌యాలు ఇద్ద‌రికి తెలిసుండాలి. ఖ‌ర్చులు, వినియోగం గురించి చ‌ర్చించుకోవాలి. ఇద్ద‌రు క‌లిసి సంపాదించుకున్న‌దాన్ని క‌లిపి పొదుపు చేసుకున్నా లేదా వేర్వేరుగా ప్ర‌ణాళిక వేసుకున్నా, ఖ‌ర్చులు, అవ‌స‌రాలు వంటివి చెప్పుకోవాలి.
పిల్ల‌ల‌తో సంభాష‌ణ‌:
త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ముందు ఆర్థిక విష‌యాలు చెప్ప‌క‌పోతే, వారు పెద్దయ్యాక దాని గురించి మాట్లాడటం అసౌకర్యంగా ఉంటుంది.  సాంప్ర‌దాయంగా వ‌స్తోన్న అల‌వాటు ప్ర‌కారం త‌ల్లిదండ్ర‌లు పిల్ల‌ల అవ‌స‌రాలు తీరుస్తారు. అంతేకాని వారితో డ‌బ్బు విష‌యాలు చ‌ర్చించ‌డం అన‌సరం అని భావిస్తారు. ఈ ఆలోచ‌న‌ల్లో మార్పు రావాలి. డ‌బ్బు విష‌యాల‌కు పిల్ల‌ల‌ను దూరంగా ఉంచ‌డం కంటే డ‌బ్బు ఎక్క‌డినుంచి, ఎలా వ‌స్తుంది, ఎంత ఖ‌ర్చువుతుంద‌నే విష‌యాలు పిల్ల‌ల‌తో చ‌ర్చించాలి, చ‌దువుకుంటే డ‌బ్బు ఎలా సంపాదించ‌వ‌చ్చు, డ‌బ్బు ప్రాముఖ్య‌త గురించి తెలియ‌జేయాలి. అయితే ఇబ్బందిక‌రంగా కాకుండా ఆహ్లాదంగా సంభాష‌ణ‌లు  ఉండాలి.
ఉన్నత విద్య ఖర్చుల కోసం, సంభాషణ ప్రత్యక్షంగా ఉండాలి. మీరు పిల్లల విద్య కోసం రుణాలు తీసుకుంటుంటే, మీరు రుణంలో  కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తున్నారని వారికి వివరించండి, వారి చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత‌  మిగిలిన మొత్తాన్ని చెల్లించాల‌ని తెలియ‌జేయండి
పిల్ల‌లు పెద్ద‌యిన త‌ర్వాత కూడా వారి అవ‌స‌రాల‌కు అడిగినంత డ‌బ్బు ఇస్తూ పోతే వారిని చేతులారా చెడ‌గొట్టిన‌వారే అవుతారు. వారు స్వ‌తంత్రంగా డ‌బ్బు సంపాదించేలా ప్రోత్స‌హించ‌డం చాలా ముఖ్యం. మీ కోసం ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని  ఏర్పాటు చేసుకోవ‌డం ముఖ్యం. మీ పిల్ల‌లు సంపాదించ‌డం మొద‌లుపెట్టాక కూడా మీ నుంచి ఆశించ‌డం స‌రైన విధానం కాదు అని అర్థ‌మ‌య్యేలా చెప్పాలి.
 స్నేహితుల‌తో చ‌ర్చ:
మీరు ఇష్ట‌ప‌డేవారికి డ‌బ్బును సుల‌భంగా ఇచ్చేస్తారు కానీ, తిరిగి అడిగేందుకు ఏదో ఇబ్బందిగా ఉంటుంది. అయితే దీనిని ప‌క్క‌న‌పెట్ట‌డం అల‌వాటు చేసుకోవాల‌ని ఆర్థిక నిపుణ‌లు సూచిస్తున్నారు. డ‌బ్బు అంత సుల‌భంగా రాదు, రూపాయి రూపాయి కూడ‌బెట్టేందుకు చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అందుకే డ‌బ్బును గౌర‌వించ‌డం నేర్చుకోవాలి. స్నేహితుల‌కు ఏదైనా ఇచ్చేట‌ప్పుడు మీ ఇష్టంతో ఇస్తున్నారా లేదా తిరిగి ఆశిస్తున్నారా అనే విష‌యాలు స్ప‌ష్ట‌త ఉండాలి. అప్పుడు తిరిగి అడిగేందుకు ఇబ్బంది ఉండ‌దు.
స్నేహితుల‌తో పార్టీలు, ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అంద‌రు కొంత వ్య‌యాన్ని భ‌రించాలి. అప్పుడే భారం ఉండ‌దు. మీరు సంతోషంగా గ‌డిపిన‌ట్లు కూడా ఉంటుంది. స్నేహితుల మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండ‌వు. ఆర్థిక విష‌యాలు మాట్లాడ‌టం ఇబ్బందిగా ఉన్న‌ప్పటికీ కొన్నిసార్లు త‌ప్ప‌దు. నెమ్మ‌దిగా అల‌వాటు చేసుకోవాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని