ప‌న్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ మంచి ఎంపిక.. ఎందుకంటే?   - ELSS-a-better-choice-for-tax-savings
close

Updated : 21/03/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ప‌న్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ మంచి ఎంపిక.. ఎందుకంటే? 

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ఈఎల్ఎస్ఎస్‌) సెక్షన్ 80 సి కింద ప‌న్ను మిన‌హాయింపు అర్హత పొందుతాయి. ఒక‌ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈఎల్ఎస్ఎస్‌లో చేసిన పెట్టుబడులపై ప‌న్ను మిన‌హాయింపును పొందవచ్చు. సంప్ర‌దాయంగా వ‌స్తోన్న‌ పీఎఫ్‌, ఎన్‌పీఎస్ వంటి త‌క్కువ రిస్క్‌తో కూడిన పొదుపు ప‌థ‌కాల కంటే ఈఎల్ఎస్ఎస్ మంచి రాబ‌డిని అందిస్తుంది. 

అయితే ఇందులో రాబడికి హామీ లేదు, ఈ పెట్టుబ‌డులు మార్కెట్-అనుసంధానంగా ఉంటాయి, కానీ దీర్ఘకాలికంగా కొన‌సాగిస్తే ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించే రాబ‌డి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్ర‌తి నెల ఈపీఎఫ్ కోసం కొంత కేటాయిస్తున్నందున, ఈఎల్ఎస్ఎస్ ఎంచుకుంటే సమతుల్యతను  పొంద‌వ‌చ్చు. దీంతో ఈక్విటీల్లో దీర్ఘ‌కాలికంగా కొన‌సాగేందుకు ఇది మంచి అవ‌కాశం. పన్ను ఆదా చేసే ఫండ్లు గత 10 సంవత్సరాల్లో 13.40 శాతం రాబడిని ఇచ్చిన‌ట్లు నివేదిక‌లు తెలుపుతున్నాయి.

ఇవి కాకుండా, పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ మంచి ఎంపిక అని చెప్ప‌డానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

అతి తక్కువ లాక్-ఇన్: ఇతర పన్ను ఆదా చేసే పెట్టుబ‌డుల‌తో పోల్చినప్పుడు ఈఎల్ఎస్ఎస్‌ 3 సంవత్సరాల అతి తక్కువ లాక్-ఇన్ పీరియ‌డ్ కలిగి ఉంది. మూడేళ్ల త‌ర్వాత‌ డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు తీసుకోవ‌చ్చు. అయితే ఈఎల్ఎస్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది మెరుగైన రాబడిని ఇవ్వగలదు, కాని  3 సంవత్సరాలకు పైగా పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మంచి రాబ‌డి వ‌స్తుంది. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఉప‌సంహ‌రించుకోకుండా కొన‌సాగిస్తే ఇది మంచి ఎంపిక‌గా మారుతుంది.

సిప్ చేయ‌వ‌చ్చు: ఈక్విటీలలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెట్టుబడులు పెట్టేందుకు ఈఎల్ఎస్ఎస్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  మూడేళ్ల త‌ర్వాత కూడా మార్కెట్ల‌‌లో ఏర్ప‌డ్డ అనిశ్చితుల‌ను చూసి భావోద్వేగంతో నిర్ణ‌యం తీసుకోకుండా దీర్ఘ‌కాలం కొన‌సాగించాలి.

ఆర్థిక సంవత్సరం ముగియబోతున్నందున, ఇప్పుడు చాలా మంది పన్ను ఆదా ప‌థ‌కాల‌లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. ఏదేమైనా, రూపాయి-వ్యయం సగటు  ప్రయోజనాన్ని పొందడానికి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా మంచిది. కాబట్టి, మీరు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబ‌డులు ఇప్పుడే ప్రారంభించవచ్చు, వచ్చే ఏడాది దానిని అస్థిరమైన పద్ధతిలో కొనసాగించవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని