ఈపీఎఫ్‌ఓ ఖాతాలు 20% పెరిగాయ్‌ - EPFO Accounts increased 20 pc
close

Published : 21/04/2021 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈపీఎఫ్‌ఓ ఖాతాలు 20% పెరిగాయ్‌

ఫిబ్రవరిలో 12.37 లక్షల మంది చేరిక

దిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో ఫిబ్రవరిలో కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. 2020 ఇదే నెలతో పోలిస్తే ఈసారి 20 శాతం ఎక్కువ. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ సంఘటిత రంగంలో ఉపాధి పెరిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 2021తో పోలిస్తే ఫిబ్రవరి 2021లో నికర వినియోగదార్లు 3.52 శాతం పెరిగారు. గత ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2021 వరకు) నికరంగా 69.58 లక్షల మంది చందాదారులు అదనంగా జత చేరారు. 2019-20లో నికరంగా 78.58 లక్షల మంది; 2018-19లో 61.12 లక్షల మంది అదనంగా చేరారు. కాగా, 4.81 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి నిష్క్రమించి మళ్లీ చేరారు. అంటే ఈపీఎఫ్‌ఓలోని కంపెనీల్లోనే వీరు ఉద్యోగాలు మారారు. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌కు బదులు, నిధులు బదిలీ చేసుకుని సభ్యత్వాన్ని అట్టేపెట్టి ఉంచుకున్నారు. 
* ఫిబ్రవరి 2021లో 22-25 వయసు వారు 3.29 లక్షల మంది, 29-35 ఏళ్ల వారు 2.51 లక్షల మంది జతచేరారు.
* ‘నిపుణుల సేవల’ విభాగంలో 4.99 లక్షల మంది, ‘ట్రేడింగ్‌-వాణిజ్య సంస్థల’ విభాగంలో  84,000 మంది జతచేరారు.
* మహారాష్ట్ర, హరియాణ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నికర నమోదులో ముందున్నాయి. ఈ అయిదు కలిపి మొత్తం నికర ఖాతాదార్ల నమోదులో 54.81 శాతాన్ని కలిగి ఉన్నాయి. 
* ఫిబ్రవరిలో నమోదైన నికర ఖాతాదార్లలో 21 శాతం వాటా మహిళలది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని