జనవరిలో కొత్తగా 13.36 లక్షల ఉద్యోగాలు! - EPFOs net new enrolments up 28 pc to 13 lakh in January
close

Published : 21/03/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరిలో కొత్తగా 13.36 లక్షల ఉద్యోగాలు!

ఈపీఎఫ్‌ఓ నికర చందాదారుల్లో 27.79% వృద్ధి

దిల్లీ: జనవరిలో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 13.36 లక్షల మంది నికర చందాదారులు చేరారు. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 27.79 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబరుతో పోల్చినా 24 శాతం మంది అధిక చందాదారులు ఈపీఎఫ్‌ఓలో నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో కొత్తగా 62.49 లక్షల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు.

ఇక జనవరిలో కొత్తగా చేరిన 13.36 లక్షల మందిలో 8.20 లక్షల మంది కొత్తవారు కాగా.. మిగిలిన 5.16 లక్షల మంది ఉద్యోగాలు మారినవారు లేదా వైదొలిగి తిరిగి చేరినవారు. కరోనా ప్రభావంతో జూన్‌లో ఈపీఎఫ్‌ఓ నుంచి నిష్క్రమించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. అప్పటి నుంచి ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం గమనార్హం.

వయస్సుల వారీ విశ్లేషణ ప్రకారం.. జనవరిలో 22-25 మధ్య వయస్సు గల కొత్త చందాదారుల సంఖ్య నికరంగా 3.48 లక్షలుగా, ఈ వర్గాన్ని కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న వారిగా పరిగణించవచ్చు. ఇక 29-35 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఖ్య నికరంగా 2.69 లక్షలుగా నమోదైంది.

ఈపీఎఫ్‌ఓ గణాంకాల ప్రకారం.. ఉపాధి కల్పనలో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి జనవరిలో కొత్తగా 34.24 లక్షల మంది నికర చందాదారులు చేరారు. పరిశ్రమల వారీగా చూస్తే సేవా నిపుణులకు అత్యధికంగా ఉపాధి లభించింది. కంప్యూటర్‌-ఐటీ ఆధారిత సేవలు, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, జనరల్‌ ఇంజినీరింగ్‌ ప్రోడక్ట్‌లకు సంబంధించిన సంస్థల్లో కొత్త ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 40 శాతం వృద్ధి నమోదైంది.

ఇవీ చదవండి...

కనుపాపలే.. పాస్‌పోర్టులు

డిజిటల్‌ మోసాలకు టెక్నాలజీతో కళ్లెం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని