విద్యుత్‌ వాహనాల అమ్మకాల్లో 20% క్షీణత - EV Sales down by 20 pc
close

Updated : 23/04/2021 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్‌ వాహనాల అమ్మకాల్లో 20% క్షీణత

దిల్లీ: భారత్‌లో గత ఆర్థిక సంవత్సరం (2020-21) విద్యుత్‌ వాహనాల అమ్మకాలు 20 శాతం క్షీణించి 2,36,802కు పరిమితమయ్యాయి. 2019-20లో 2,95,693 వాహనాలు అమ్ముడయ్యాయి. విద్యుత్‌ వాహనాల తయారీదార్ల సంఘం (ఎస్‌ఎంఈవీ) గణాంకాల ప్రకారం.. విద్యుత్‌ ద్విచక్రవాహన (ఈ2డబ్ల్యూ) అమ్మకాలు 1,52,000 నుంచి 6 శాతం తగ్గి 1,43,837కు పరిమితమయ్యాయి. విద్యుత్‌ త్రిచక్రవాహనాల (ఈ3డబ్ల్యూ) అమ్మకాలు కూడా 1,40,683 నుంచి 88,378 కు తగ్గాయి. విద్యుత్‌ కార్ల (ఈ4డబ్ల్యూ) అమ్మకాలు 3000 నుంచి 53 శాతం పెరిగి 4,588కు చేరాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని