3 రోజులు..8 కంపెనీలు..రూ.1.28 లక్షల కోట్లు - Eight of top 10 most valued companies added above 1lakh cr in mcap
close

Updated : 04/04/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రోజులు..8 కంపెనీలు..రూ.1.28 లక్షల కోట్లు

మార్కెట్ల సానుకూలతలతో లాభపడ్డ కంపెనీలు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి పది కంపెనీల్లో ఎనిమిదింటి విలువ గతవారం గణనీయంగా వృద్ధి చెందింది. మార్కెట్ల ఒడుదొడుకుల నేపథ్యంలో అంతకుముందు రెండు వారాలు విలువ కోల్పోయిన పలు కంపెనీలు ఈ వారం పుంజుకోవడం విశేషం. గడిచిన వారంలో మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బీఎస్‌ఈ సూచీ రెండు శాతం ఎగబాకడం విశేషం.

ట్రేడింగ్‌ నడిచిన మూడు రోజుల్లో 8 కంపెనీల మార్కెట్ విలువ రూ.1,28,503.47 కోట్లు పెరిగింది. ఇలా లాభపడ్డ షేర్లలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ముందువరుసలో ఉన్నాయి. టీసీఎస్ విలువ రూ.36,158.22 కోట్లు ఎగబాకి రూ.11,71,082.67 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ విలువ రూ.20,877.24 కోట్లు పెరగడంతో కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ 5,90,229.35 కోట్లకు ఎగబాకింది. తర్వాత హెచ్‌యూఎల్‌ విలువ రూ.19,842.83 కోట్లు పెరిగి రూ.5,63,767.05 కోట్లకు చేరింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.17,401.77 కోట్లు ఎగబాకి.. రూ.12,81,644.97 కోట్ల వద్దకు చేరింది. ఇక ఎస్బీఐ మార్కెట్‌ విలువ రూ.12,003.6 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ రూ.10,681 కోట్లు, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలువ రూ.6,301 కోట్లు, బజాజ్‌ ఫినాన్స్‌ విలువ రూ.5,236.49 కోట్లు పెరిగింది.

ఇక వీటికి భిన్నంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ విలువ కోల్పోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ విలువలో రూ.3,142.29 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ విలువలో రూ.171.38 కోట్లు కోత పడ్డది.

ఇక మార్కెట్‌ విలువ ఆధారంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని