Electrical equipment: 2025 నాటికి 72 బి.డాలర్లకు ఎలక్ట్రికల్‌ ఉపకరణాల రంగం! - Electrical equipment mkt may grow at 12 pc annually
close

Published : 19/09/2021 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Electrical equipment: 2025 నాటికి 72 బి.డాలర్లకు ఎలక్ట్రికల్‌ ఉపకరణాల రంగం!

దిల్లీ: ఎలక్ట్రికల్‌ ఉపకరణాల మార్కెట్‌ ఏటా 12 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 48-50 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ విలువ 2025 నాటికి 72 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ‘ఇండియన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(ఐఈఈఎంఏ)’ అధ్యక్షుడు అనిల్‌ సాబూ అంచనా వేశారు. ప్రస్తుతం 8.62 బిలియన్‌ డాలర్లు విలువ చేసే వస్తువులను ఎగుమతి చేస్తున్నామని.. వచ్చే కొన్నేళ్లలో ఇది 13 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. 

పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో ఎలక్ట్రికల్‌ రంగం కీలక పాత్ర పోషించనుందని అనిల్‌  అన్నారు. 2022 నాటి 175 గిగావాట్స్, 2030 నాటికి 450 గిగావాట్స్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అత్యాధునిక పరికరాలు అవసరముంటాయని.. వాటిని తయారు చేసేందుకు దేశీయ ఎలక్ట్రికల్‌ పరిశ్రమ సిద్ధంగా ఉందన్నారు. ఈ రంగంలోకి ఏటా 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని