close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా కథనాలు

ఎయిరిండియా బిడ్‌కు మరింత గడువు?

ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువును ప్రభుత్వం మరింత పొడిగించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో, ఏప్రిల్‌ 30 వరకు ఉన్న గడువును మరింత పెంచవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


భాగస్వామ్యానికి హోండా, ఉషా ఇంటర్నేషనల్‌ స్వస్తి

విద్యుత్తు ఉపకరణాల రంగంలో రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న భాగస్వామ్యానికి స్వస్తి చెబుతున్నట్లు జపాన్‌కు చెందిన హోండా మోటార్‌ కో, భారత్‌కు చెందిన ఉషా ఇంటర్నేషనల్‌ ప్రకటించాయి. వీటి సంయుక్త సంస్థగా హోండా సియెల్‌ పవర్‌ ప్రోడక్ట్స్‌ ఉంది. పోర్టబుల్‌ జనరేటర్లు, నీటి పంపులు, టిల్లర్లు, ఇంజిన్లను ఈ సంస్థ తయారు చేస్తోంది.


ఎలక్ట్రానిక్స్‌, మొబైల్స్‌ వారెంటీ పొడిగింపు

కరోనా నేపథ్యంలో మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వారెంటీని పొడిగించాయి.
శామ్‌సంగ్‌: అన్ని ఉత్పత్తులపై మార్చి 20- ఏప్రిల్‌ 30 ముగిసే వారెంటీ గడువును మే 31 వరకు పొడిగించింది.
వన్‌ప్లస్‌, ఓపో: మార్చి 1 - ఏప్రిల్‌ 30 వరకు ఉన్న వారెంటీ గడువును మే 31 వరకు విస్తరించాయి.
రియల్‌మి: వారెంటీని మే 31 వరకు పొడిగించడంతో పాటు, మార్చి 15-ఏప్రిల్‌ 30 మధ్య కొనుగోలు చేసిన వారికి రీప్లేస్‌మెంట్‌ గడువును కూడా 30 రోజులు అదనంగా ఇచ్చింది.
డెటెల్‌: ఫోన్లు, టీవీలకు వారెంటీని మరో 60 రోజులు ఇచ్చింది.
లావా: మార్చి 15-మే 15 మధ్య ముగిసే వారెంటీని 60 రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది.


బజాజ్‌ అన్ని వాహనాలకూ ఉచిత సర్వీస్‌, వారెంటీ పొడిగింపు

బజాజ్‌ ఆటో తన ద్విచక్ర, వాణిజ్య వాహనాలకూ ఉచిత సర్వీస్‌తో పాటు వారెంటీ గడువును పెంచింది. మార్చి20-ఏప్రిల్‌ 30 మధ్య ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీస్‌,  వారెంటీని మే 31 వరకు పొడిగిస్తున్నట్లు బజాజ్‌ ఆటో ఈడీ రాకేశ్‌ శర్మ తెలిపారు. వాణిజ్య వాహనాలకు (3-4 చక్రాలు) 1, 2, 3 ఉచిత సర్వీసులకు ఏప్రిల్‌ 30 వరకు ఉన్న గడువును 2 నెలలు పొడిగించారు. మార్చి-ఏప్రిల్‌ నెలల్లో వారెంటీ ముగిస్తే, 2 నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు తెలిపింది.


అదనపు స్పెక్ట్రమ్‌ అవసరం లేదు: కాయ్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌), వీడియోలు చూడటం పెరిగినందున, నాణ్యమైన సేవల కోసం అదనపు స్పెక్ట్రమ్‌ అవసరం లేదని సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం కాయ్‌ బుధవారం తెలిపింది. టెలికాం నెట్‌వర్క్‌ల సేవల్లో స్థిరత్వం, నాణ్యత కోసం అదనపు స్పెక్ట్రమ్‌ కావాలని గతంలో కాయ్‌ కోరిన సంగతి విదితమే. కొన్ని స్ట్రీమింగ్‌ సేవల సంస్థలు ప్రసారాలను హెచ్‌డీ నుంచి ఎస్‌డీకి తగ్గించినందున, సమస్య రాదని తాజాగా కాయ్‌ వివరించింది.

* ప్రభుత్వం సూచించిన 12 రోజుల వ్యవధిలోనే శానిటైజర్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జైడస్‌ వెల్‌నెస్‌ ప్రకటించింది. సూక్ష్మక్రిములను 99.9 శాతం నాశనం చేసే ఈ శానిటైజర్‌ను నైసిల్‌ బ్రాండ్‌పై విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
* మార్పిడి రహిత డిబెంచర్ల ద్వారా రూ.1,000 కోట్లకు మించకుండా నిధులు సమీకరించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపినట్లు గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.
* కేరళ, గుజరాత్‌, తమిళనాడుల్లోని ప్లాంట్లను ఏప్రిల్‌ 14 వరకు మూసిఉంచుతామని అపోలో టైర్స్‌ ప్రకటించింది.
* దక్షిణాఫ్రికాలోని సంయుక్త సంస్థ సెనెర్జిలో 50 శాతం వాటాను ఎగ్జారో రీసోర్సెస్‌కు రూ.659 కోట్లకు విక్రయించినట్లు టాటా పవర్‌ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.