వారంలో భారీగా కరిగిన మస్క్‌ సంపద! - Elon Musk loses 27 billion dollars in 4 days
close

Published : 06/03/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో భారీగా కరిగిన మస్క్‌ సంపద!

వాషింగ్టన్‌: గత ఏడాది భారీ సంపదను పోగేసి రికార్డు సృష్టించిన టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో చతికిలపడ్డారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన సంపద ఏకంగా 27 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం 156.9 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఉన్న జెఫ్‌ బెజోస్‌ కంటే మస్క్‌ సంపద 20 బిలియన్‌ డాలర్లు తక్కువగా ఉంది.

గత కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నాలుగు వారాల్లో మస్క్‌ సంపద ఊహించిన దానికంటే భారీగా దిగజారుతూ వచ్చింది. టెస్లా కంపెనీ షేర్ల విలువ నాలుగు వారాల్లో 230 బిలియన్‌ డాలర్ల మేర పడిపోయింది. ఈ ఒక్క వారంలోనే సంస్థ షేర్ల విలువ 11 శాతం పతనమైంది. 2019 మే తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికాలో బాండ్ల మార్కెట్ల వల్ల నెలకొన్న ప్రతికూలతలే టెస్లా షేర్ల పతనానికి కారణమైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ 574 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జనవరిలో ఇది 837 బిలియన్‌ డాలర్లకు ఎగిసిన విషయం తెలిసిందే. 2020లో కంపెనీ షేర్ల విలువ 743 శాతం పెరగడంతో ఏడాది వ్యవధిలో మస్క్‌ సంపద భారీగా ఎగబాకింది. కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగడంతో జనవరిలో ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా నిలిచారు. కానీ, మార్కెట్ల ప్రతికూలతలతో ఆ స్థానంలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఇటీవల మస్క్‌ బిట్‌కాయిన్లలోనూ పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ విలువ పడిపోవడం కూడా మస్క్‌ సంపద తరుగుదలకు ఓ కారణమైంది.

ఇవీ చదవండి...

అగ్ర స్థానం నుంచి ‘మా’యం..!

ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్‌షా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని