బెంగళూరులో టెస్లాకార్ల తయారీ..? - Elon Musks Tesla to set up electric car manufacturing unit in Karnataka
close

Published : 14/02/2021 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగళూరులో టెస్లాకార్ల తయారీ..?

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం టెస్లా బెంగళూరులో విద్యుత్తు కార్ల తయారీ కర్మాగారం నెలకొల్పేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ రాయిటార్స్‌ కర్ణాటక ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ఈ మేరకు కథనం వెలువరించింది. అమెరికా సంస్థ టెస్లా కర్ణాటకలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. గత నెలలో టెస్లా బెంగళూరులో తన భారతీయ విభాగ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కూడా ఆర్‌వోసీ వద్ద చేయించింది.

గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప టెస్లాకు సంబంధించి ఓ కీలక విషయాన్ని ట్వీట్‌ చేసి ఆ తర్వాత  డిలీట్‌ చేశారు. టెస్లా తొలుత భారత్‌లో ఆర్‌అండ్‌డీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.  శనివారం కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన ఆర్‌అండ్‌డీ యూనిట్‌కు సంబంధించి చేసిందా.. లేదా కేవలం తయారీ విభాగం యూనిట్‌ను మాత్రమే  ఉద్దేశించి చేసిందా అనే విషయం తెలియరాలేదు.  కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన లబ్ధిని తెలియజేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

వాస్తవానికి గత కొన్నేళ్లుగా భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించాలని టెస్లా భావిస్తోంది. కానీ, ఇక్కడి పన్ను విధానాల్లో కొన్ని అభ్యంతరాలు ఉండటంతో ఆగిపోయింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం పాలసీల్లో మార్పులు చేయడంతో టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌ డిసెంబర్‌లో ట్విటర్‌లో వెల్లడించారు.  మరో పక్క భారత్‌ కూడా విద్యుత్తు కార్ల తయారీని ప్రోత్సహించి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అందుకోసం 4.6 బిలియన్‌ డాలర్ల మేరకు రాయితీలు ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.

ఇవీ చదవండి

ఆరో రోజూ పెట్రో ధరలు పైపైకే..
ప్రేమతో.. బహుమతి

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని