Salary: భారత్‌లో వచ్చే ఏడాది వేతనాల్లో గణనీయ పెంపు! - Employees in India will see bigger pay rises next fiscal year
close

Updated : 24/07/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Salary: భారత్‌లో వచ్చే ఏడాది వేతనాల్లో గణనీయ పెంపు!

ఎయాన్‌ పీఎల్‌సీ, మైకేల్‌ పేజ్‌ నివేదిక అంచనా

దిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నుంచి వ్యాపార సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం కోలుకోనున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వృత్తి నిపుణుల కొరత కూడా వేతనాల పెంపునకు దోహదం చేయనుందని పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థలైన ఎయాన్‌ పీఎల్‌సీ, మైకేల్‌ పేజ్‌ రూపొందించిన నివేదిక పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలో 6-8 శాతం మేర వేతనాలు పెరిగనున్నాయని పలు సర్వేలు గతంలో అంచనా వేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆసియా దేశాల్లో భారత్‌లోనే అధిక వేతన పెంపు ఉంటోందని గుర్తు చేసింది. రానున్న రెండేళ్లు కూడా అదే పోకడ కొనసాగనుందని స్పష్టం చేసింది.

ఇ-కామర్స్‌, ఫార్మా, ఐటీ, ఆర్థిక సేవల రంగంలో వేతనాలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. రిటైల్‌, ఏరోస్పేస్‌, హోటల్‌, హాస్పిటాలిటీ రంగాలు మాత్రం వేతన పెంపులో వెనుబడనున్నాయని తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని