సంక్షోభంలోనూ భారత్‌లో పెట్టుబడుల హవా - FDI rises 40 pc to USD 51 bn in Apr-Dec 2020-21
close

Published : 04/03/2021 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షోభంలోనూ భారత్‌లో పెట్టుబడుల హవా

దిల్లీ: కరోనా మహమ్మారి వల్ల ఏర్పడి సంక్షోభ సమయంలోనూ భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో ఎఫ్‌డీఐలు 40శాతం పెరిగి దేశంలో 51.47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. 

ఒక్క మూడో త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లోనే విదేశీ పెట్టుబడులు 37శాతం పెరిగి 26.16 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. డిసెంబరు నెలలో 9.22 బిలియన్‌ డాలర్లు పెట్టుబడుల రూపంలో దేశంలోకి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గత ఆరున్నరేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, సులభతర వాణిజ్య విధానాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలతో దేశంలోకి ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది. 

ఇవీ చదవండి..

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.5శాతం!

కోవిడ్ 19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కి బీమా వర్తిస్తుందా? 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని