ఫిబ్రవరిలోనూ ఎఫ్‌పీఐ పెట్టుబడుల వెల్లువ - FPIs investments Continuing in Feb
close

Published : 22/02/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరిలోనూ ఎఫ్‌పీఐ పెట్టుబడుల వెల్లువ

దిల్లీ: భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రూ.24,965 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్‌ డేటా వెల్లడించింది. వీటిలో రూ.24,204 కోట్లు ఈక్విటీల్లోకి, రూ.761 కోట్లు డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది. జనవరిలో ఎఫ్‌పీఐల ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు భారత్‌కు వచ్చాయి.

పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలపై సానుకూలంగా ఉండడంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయని గ్రో సంస్థ సీవోవో హర్ష జైన్‌ తెలిపారు. అలాగే బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక సంస్కరణలు మదుపర్లలో ఉత్సాహం నింపాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ఎస్‌.రంగనాథన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. డిజిటల్‌ రెవల్యూషన్‌ వైపు భారత్‌ అడుగులు వేసే దిశగా బడ్జెట్‌లో సంస్కరణలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో వచ్చే నెలలోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో భారత్‌, తైవాన్‌ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎఫ్‌పీఐలను రాబట్టగలిగాయి. ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలోకి పెట్టేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ విధానాలను సరళీకరించే వరకు భారత్‌లోకి పెట్టుబడులు కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు. 

ఇవీ చదవండి...

ఒకే దేశం.. ఒకే పాలసీ

ఐటీలో హైబ్రిడ్‌ మోడల్‌ కొనసాగుతుంది


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని