ఈ నెల ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.8,642 కోట్లు - FPIs net buyers at Rs 8642 cr in March
close

Published : 21/03/2021 14:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెల ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.8,642 కోట్లు

దిల్లీ: భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ)  పెట్టుబడులు మార్చిలో కాస్త నెమ్మదించాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐల ద్వారా రూ.8,642 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్‌ డేటా వెల్లడించింది. ఈక్విటీల్లోకి రూ.14,202 కోట్లు రాగా.. డెట్‌ మార్కెట్ల నుంచి రూ.5,560 కోట్లు వెనక్కి వెళ్లాయి. దీంతో నికరంగా రూ.8,642 కోట్లు వచ్చినట్లు చేరినట్లయింది. జనవరిలో ఎఫ్‌పీఐల ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు, ఫిబ్రవరిలో రూ.23,663 కోట్లు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్‌ మార్కెట్లు ఇటీవల తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో తొలుత వెనక్కి తగ్గిన మదుపర్లు మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగుతుండడంతో తిరిగి పెట్టుబడులను భారత్‌కు మళ్లిస్తున్నారు. అలాగే అమెరికాలో భారీ ఉద్దీపన పథకానికి ఆమోదం లభించడంతో అక్కడ ద్రవ్య లభ్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనూ మదుపర్లు భారత్‌వైపు చూస్తున్నారు.ఇక ఆసియాలో ఒక్క భారత్‌ మినహా మిగతా అన్ని దేశాల నుంచి ఎఫ్‌పీఐలు భారీ ఎత్తున వెనక్కి వెళుతున్నారు.

ఇవీ చదవండి..

టెలికాం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే!

జనవరిలో కొత్తగా 13.36 లక్షల ఉద్యోగాలు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని