FPI: రూ.2,249 కోట్ల ఎఫ్‌పీఐలు వెనక్కి..! - FPIs pull out Rs 2249 crore from Indian equities in July so far
close

Updated : 12/07/2021 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

FPI: రూ.2,249 కోట్ల ఎఫ్‌పీఐలు వెనక్కి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: జులై నెలలో నికరంగా ఇప్పటి వరకు రూ.2,249 కోట్లు విలువైన ఎఫ్‌పీఐలను విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తీసుకొన్నారు. ముఖ్యంగా ఇవి భారత ఈక్విటీ సెగ్మెంట్‌ నుంచి వాపస్‌ తీసుకొన్నవే. వీటిల్లో అత్యధికంగా లాభాల స్వీకరణ కోసం అమ్మేసినవే ఉన్నాయి. ప్రస్తుతం సూచీలు జీవితకాల శిఖరాల్లో ట్రేడ్‌ అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఇక డెట్‌ మార్కెట్లలో జులై 1 నుంచి 10వ తేదీ మధ్యలో రూ.2,088 కోట్ల నిధులు వచ్చినట్లు లెక్కలు చూపిస్తున్నాయి. ఇదే సమయంలో నెట్‌ అవుట్‌ ఫ్లో రూ.161 కోట్ల నిధులు ఉన్నాయి. 

ఇక జూన్‌ నెలలో ఎఫ్‌పీఐల రూపంలో నికరంగా రూ.13,269 కోట్లు వచ్చాయి. ఏప్రిల్‌, మే నెలల్లో కరోనావైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో భారీగా వాటాలను విక్రయించేశారు. ఈ నెలలో ఆసియాలోని మిగిలిన మార్కెట్లలో ఎఫ్‌పీఐల్లో కూడా విక్రయాలు కనిపిస్తున్నాయి. తైవాన్‌, దక్షిణకొరియా, థాయ్‌ల్యాండ్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా మార్కెట్లో అన్ని చోట్ల ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది.   


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని