భారత ప్రభుత్వ బాండ్లకు అంతర్జాతీయ ఆదరణ! - FTSE puts Indian govt bonds on watch for possible index inclusion
close

Published : 30/03/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత ప్రభుత్వ బాండ్లకు అంతర్జాతీయ ఆదరణ!

తమ సూచీల్లో చేర్చే యోచనలో ఎఫ్‌టీఎస్‌ఈ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రభుత్వ బాండ్లపై అంతర్జాతీయంగా విశ్వాసం పెరుగుతోంది. స్థిరమైన ఆదాయంతో పాటు నమ్మకమైన చెల్లింపులు, మంచి రాబడులు మన బాండ్ల మార్కెట్‌కు ఆదరణ లభించడానికి కారణమవుతున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ ఎఫ్‌టీఎఫ్‌ఈ రస్సెల్‌ గ్రూప్‌ భారత ప్రభుత్వ బాండ్ల ప్రాముఖ్యతను గుర్తించింది. త్వరలో వీటిని వారి ప్రముఖ సూచీల్లో ఒకటైన ‘ఎఫ్‌టీఎస్‌ఈ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ గవర్నమెంట్‌ బాండ్‌ ఇండెక్స్‌’లో చేర్చేందుకు పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో మన బాండ్ల మార్కెట్‌ అనుమతిని మెరుగుపరిచినట్లు తెలిపారు.

ఎఫ్‌టీఎస్‌ఈ తీసుకున్న తాజా నిర్ణయంతో మన దేశ డెట్‌ మార్కెట్లోకి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అలాగే అవి సుదీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. ఇది ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడనుంది. ప్రభుత్వ బాండ్‌ మార్కెట్‌ను మరింత సులభతరంగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఎఫ్‌టీఎస్‌ఈ ప్రకటన ఓ గుర్తింపుగా భావించొచ్చు. ఎఫ్‌టీఎస్‌ఈ సూచీల్లో చేరడం వల్ల దాదాపు 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు డెట్‌ మార్కెట్‌లోకి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కొత్తగా తీసుకొచ్చిన ‘ఫుల్లీ యాక్సెసబిలిటీ’ మార్గం ద్వారా ప్రభుత్వం జారీ చేస్తున్న బాండ్లపై ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారని ఎఫ్‌టీఎస్‌ఈ తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఎఫ్‌టీఎస్‌ఈ ఇండియన్‌ గవర్నమెంట్‌ బాండ్‌ ఇండెక్స్‌’ పేరిట ఓ సూచీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని