పిల్లల కోసం పెట్టుబ‌డులు చేసేటప్పుడు పరిగణించవలసిన విష‌యాలు - Factors-to-consider-while-buying-a-Child-plan
close

Published : 01/07/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల కోసం పెట్టుబ‌డులు చేసేటప్పుడు పరిగణించవలసిన విష‌యాలు

సాంప్రదాయ ప్రణాళికల నుంచి మార్కెట్-అనుసంధాన పాలసీల వరకు వివిధ భీమా సంస్థలు పిల్లల కోసం ప్రణాళికలను అందిస్తున్నాయి. సాంప్రదాయ ప‌థ‌కాలు డెట్ ఫండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుండగా, మార్కెట్-అనుసంధానిత‌ పాలసీలు డెట్‌, ఈక్విటీలలో పెట్టుబ‌డుల‌కు అనుమ‌తిస్తాయి.  పాఠశాల విద్య, అభిరుచులు, ఉన్నత చ‌దువులు, క్రీడలు మొదలైన వాటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ప్రణాళిక వేసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెప్తున్నారు. 
ముఖ్యంగా పిల్ల‌ల చ‌దువుల‌కు ఆర్థిక భ‌ద్రత ఉంటే వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన‌వారవుతారు. ఒక‌వేళ అనుకోకుండా పాల‌సీదారులు మ‌ర‌ణించినా పిల్ల‌ల‌కు స‌మ‌యానికి త‌గిన ఆర్థిక స‌హాయం అందుతుంది. ఇటువంటి సంద‌ర్భాల్లో ప్రీమియం కూడా ర‌ద్ద‌వుతుంది

సాంప్రదాయ పెట్టుబడి మార్గాలైన పీపీఎఫ్‌ లేదా ఎఫ్‌డిలతో పోలిస్తే పిల్లల ప్రణాళికలు ఎక్కువ రాబడిని ఇస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎంత తొంద‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అంత మంచిది. ఇది దీర్ఘ‌కాలం కొన‌సాగ‌డంతో మంచి రాబ‌డిని అందించ‌డంతో పాటు, ఎక్కువ కార్ప‌స్‌ను నిర్మించుకోవ‌చ్చు. 
సరైన ప్రణాళికను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.  పిల్లల లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే పిల్ల‌ల కోసం ప‌థ‌కాలు అన‌గానే అంద‌రూ ఒకే ప్ర‌ణాళిక‌ను ఎంచుకోకుండా వారి ఆశ‌యాలు, ల‌క్ష్యాల కోసం తగిన ప్రణాళికను ఎంచుకోవాలి.
 పెట్టుబ‌డుల కేటాయింపు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశం. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల‌న‌కుంటే ఈక్విటీ-ఆధారిత ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి. అయితే ఇందులో ఎక్కువ రాబ‌డి పొందేందుకు ప‌దేళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ‌కాలం కొన‌సాగించాలి. మ‌రోవైపు ఈక్విటీ, డెట్ ప‌థ‌కాల‌ను బ్యాలెన్స్ చేసే పెట్టుబ‌డుల‌ను ఎంచుకుంటే కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది.
తక్కువ రిస్క్ తీసుకోవాల‌నుకునేవారికోసం ఎండోమెంట్ ప‌థ‌కాలు స‌రైన‌వ‌ని నిపుణుల అభిప్రాయం.  ఇది మీకు తగిన క‌వ‌రేజ్ ఇవ్వడమే కాకుండా అస్థిర మార్కెట్ పరిస్థితుల నుంచి భ‌ద్ర‌త‌నిస్తుంది.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని