పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌ - Fastag in the parking lot
close

Published : 14/09/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌

డీఎంఆర్‌సీలో ప్రారంభించిన పేటీఎం

దిల్లీ: ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ రుసుము చెల్లింపు సేవలను దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో కలిసి ప్రారంభించినట్లు డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) వెల్లడించింది. ఇందువల్ల ఫాస్టాగ్‌ ఉన్న కార్లు, పార్కింగ్‌ కౌంటర్‌ వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా వెళ్లేందుకు వీలవుతుంది. కార్లతో పాటు ద్విచక్రవాహనాలకూ యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేటీఎం పేర్కొంది. జూన్‌ నాటికి పేటీఎం కోటికి పైగా ఫాస్టాగ్‌లను జారీ చేసింది. మొత్తం అన్ని బ్యాంకులూ కలిసి జూన్‌ చివరి నాటికి 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశాయి. రానున్న రోజుల్లో షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లోని పార్కింగ్‌ స్థలాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు పలు సంస్థలతో చర్చిస్తున్నట్లు పేటీఎం తెలిపింది.


ఇన్ఫీ రూ.9,200 కోట్ల బైబ్యాక్‌ పూర్తి

దిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.9,200 కోట్ల బైబ్యాక్‌ (షేర్ల తిరిగి కొనుగోలు) ప్రక్రియను పూర్తి చేసింది. ఇందులో భాగంగా 5.58 కోట్ల షేర్లను సగటున రూ.1,648.53 ధరకు తిరిగి కొనుగోలు చేసినట్లు సోమవారం కంపెనీ తెలిపింది. అత్యధికంగా వెచ్చించిన ధర రూ.1,750 కాగా.. అత్యల్పంగా రూ.1538.10 అని పేర్కొంది. ‘కంపెనీ చెల్లించిన మూలధనంలో (బైబ్యాక్‌కు ముందు) 1.31 శాతానికి సమానమైన 5,58,07,337 ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేశాం. ఇందుకోసం రూ.91,90,99,99,599.80లను (లావాదేవీ వ్యయాలు మినహా) వెచ్చించినట్లు’ ఇన్ఫోసిస్‌ తెలిపింది. బైబ్యాక్‌ అనంతరం కంపెనీలో ప్రమోటర్ల వాటా పరిమితి 12.95 శాతం నుంచి 13.12 శాతానికి పెరిగింది. జూన్‌ 25న బైబ్యాక్‌ ప్రక్రియను ఇన్ఫోసిస్‌ ప్రారంభించగా.. సెప్టెంబరు 8న ఇది ముగిసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని