Federal Bnak Q2 results: ఫెడరల్‌ బ్యాంకు లాభంలో 55 శాతం వృద్ధి - Federal Bank Q2 consolidated net profit jumps 55 pc
close

Published : 22/10/2021 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Federal Bnak Q2 results: ఫెడరల్‌ బ్యాంకు లాభంలో 55 శాతం వృద్ధి

దిల్లీ: ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్‌ బ్యాంక్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.315.70 కోట్ల లాభాలతో పోలిస్తే 55 శాతం వృద్ధి నమోదైంది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.4,013.46 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.4,071.35 కోట్లుగా ఉంది. మరోవైపు క్రితం ఏడాది రూ.3,591.72(0.99 శాతం) ఉన్న నికర నిరర్ధక ఆస్తులు 1.15 శాతానికి పెరిగి రూ.4,558.19 కోట్లుగా నమోదయ్యాయి. మొండి బకాయిలు, కంటింజెన్సీల నిమిత్తం ఏడాది క్రితం రూ.565.46 కోట్ల కేటాయింపులు చేయగా.. ఈసారి అవి రూ.264.53 కోట్లకు తగ్గింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని