ఆన్‌లైన్‌లో 50కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారం - Fifty crore facebook users details Available on online
close

Updated : 04/04/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌లో 50కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారం

మరోసారి బయటపడ్డ సామాజిక మాధ్యమాల భద్రతా వైఫల్యాలు

​​​​

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం కలకలంరేపింది. హ్యాకర్లు సులువుగా ఈ సమాచారం పొందేలా ఓ వెబ్‌సైట్‌లో ఈ వివరాల్ని ఉంచినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇందులో 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్‌ ఐడీలు, చిరునామాలు ఉన్నట్లు తెలిపింది.

ఈ సమాచారం అంతా పాతదేనని సైబర్‌ నిపుణులు తెలిపారు. అయినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల సమాచార భద్రతపై సందేహాలకు ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికాకు చెందిన 267 మిలియన్ల వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా 2019, డిసెంబరులో ఉక్రెయినియన్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా లభ్యమైన సమాచారానికీ.. దీనికీ సంబంధం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

గతంలో 87 మిలియన్ల ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలైటికా చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఫేస్‌బుక్‌ 2018లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఫోన్‌నెంబర్‌ ఆధారంగా వినియోగదారుల సమాచారం కనిపించకుండా చేసింది.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని