పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌లో చేయ‌కూడ‌ని పొర‌పాట్లు - Financial-planning
close

Updated : 18/12/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌లో చేయ‌కూడ‌ని పొర‌పాట్లు

సాధార‌ణంగా పెట్టుబ‌డులు చేయాల‌నుకునేవారు వివిధ ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలైన మ్యూచువ‌ల్ ఫండ్లు, బీమా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్థిరాస్తి , బంగారం వంటి వాటిలో పెట్టుబ‌డులు పెడ‌తారు. చాలామంది ఎటువంటి స‌ల‌హాలు తీసుకోకుండానే పెట్టుబ‌డులు పెడుతుంటారు. సాధార‌ణంగా పెట్టుబ‌డులు విష‌యాల్లో జ‌రిగే త‌ప్పిదాల గురించి తెలుసుకుందాం

ఫండ్ గ‌త ప‌నితీరును బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌డం
మ్యూచువ‌ల్ ఫండ్ ఏజెంట్ లేదా డిస్ర్టిబ్యూట‌ర్ ఏదైనా ఒక ఫండ్ గ‌త ఏడాది 30 శాతం రాబ‌డి వ‌చ్చింద‌ని, ఆ ఫండ్ తీసుకోమ‌ని చెప్తే ఆ ఒక్క అంశంతోనే ఫండ్‌ను కొనుగోలు చేయ‌కూడ‌దు. మ్యూచువ‌ల్ ఫండ్ గ‌త ప‌నితీరు అనేది బెంచ్‌మార్క్ కాదు. కేవ‌లం గ‌తంలో వ‌చ్చిన రాబ‌డి ఒక్క‌టి చూసి అంచ‌నా వేయ‌కూడ‌దు. ఫండ్ల గురించి తెలుసుకోవాల‌నుకున్న‌ప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ స్కీముల‌ను, ఫండ్ మేనేజ‌ర్ల పనితీరు , ఏఎమ్‌సీ ట్రాక్ రికార్డుల‌ను ప‌రిశీలించాలి.

ఎక్కువ‌ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు
మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు కొత్తగా ప్రారంభిస్తున్న‌ట్ల‌యితే ఒకేసారి 10-20 ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను కొనుగోలు చేయ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. మీరు తీసుకున్న మీరు 10-20 మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే, ఒకే స్టాక్‌లోకి ఎక్కువ పెట్టుబ‌డులు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. దీంతో న‌ష్ట‌భ‌యం ఎక్క‌వ అవుతుంది. ఈక్విటీ, డెట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీముల‌తో క‌లిపి ఆరు కంటే ఎక్కువ మ్యూచువ‌ల్ ఫండ్ల స్కీములు మీ పోర్ట్‌ఫోలియోలో ఉండ‌కూడదు.

నేరుగా షేర్ల‌లో పెట్ట‌డం
మొద‌ట పెట్టుబ‌డుదారులు అర్థం చేసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఒకేసారి రాబ‌డి రాదు. డైరెక్ట్ స్టాకులో పెట్టుబ‌డులు పెడ‌తున్న‌ప్పుడు కంపెనీ, వృద్ధి , డెట్‌-ఈక్విటీల నిష్ప‌త్తి, డివిడెండు, నిర్వ‌హ‌ణ వంటివి ప్రామాణికంగా తీసుకోవాలి. పెట్టుబ‌డులు పెట్టిన వెంట‌నే పెద్ద మొత్తంలో లాభాలు ఆశించ‌కూడ‌దు. ముందుగా అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించి ఆ త‌ర్వాత పెట్టుబడులు ప్రారంభించాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా అడుగుపెట్టాలి
చాలా సార్లు ఈక్విటీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌రైన స‌మ‌యం కోసం చూస్తుంటారు. ఈక్విటీ పెట్టుబ‌డులు అనేవి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌తో కూడుకున్న‌వి. అందుకే దీనికి అనువైన స‌మ‌యం కావాలి. ఒకేసారి నేరుగా స్టాక్ మార్కెట్ల‌లో కాకుండా మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే మంచిది. స్టాక్ మార్కెట్ల‌ను చాలా అంశాలు ప్ర‌భావితం చేస్తాయి. మీ అవ‌స‌రాల‌కు, భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌కు అనుగుణ‌గా పెట్టుబ‌డులు కొన‌సాగుతున్నాయా లేదా అని చూసుకోవాలి. కానీ, మార్కెట్లు స్వ‌ల్ప‌కాలం అనిశ్చితి గురైనంత మాత్రాన పెట్టుబ‌డులు వెన‌క్కి తీసుకోకూడ‌దు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని