Big Billion Day: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ మార్పు.. ఎప్పుడంటే? - Flipkart Changes Big Billion Sales Date
close

Published : 26/09/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Big Billion Day: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ మార్పు.. ఎప్పుడంటే?

దిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ విక్రయాలను అక్టోబరు 3 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ విక్రయాలను అక్టోబరు 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ గత మంగళవారం ప్రకటించింది. అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించి పోటీకి తెరతీసింది. ఈ వేడిని మరింత పెంచుతూ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ తేదీలను అక్టోబరు 3-10కు మార్చింది. కరోనా సంక్షోభం తర్వాత వ్యాపారులు మళ్లీ పుంజుకునేందుకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ విక్రయాలు చాలా కీలకమని, దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను ఈ కార్యక్రమం సృష్టిస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీంతో అందరికీ లబ్ది చేకూరే విధంగా బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2021 తేదీలను మారుస్తున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా స్పందించలేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని