మధ్యవర్తిత్వం కోసం భారత కంపెనీలు బయటకెళ్లొచ్చు - For mediation Indian companies may go out
close

Published : 21/04/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యవర్తిత్వం కోసం భారత కంపెనీలు బయటకెళ్లొచ్చు

దిల్లీ: దేశంలో ఏర్పాటైన రెండు కంపెనీలు మధ్యవర్తిత్వం కోసం భారత్‌ వెలుపల ఉండే ఏదైనా ఫోరమ్‌ను ఎంచుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ స్ఫూర్తిని అందిపుచ్చుకునే అంశంలో కక్షివర్గాల స్వతంత్రతను సమర్థిస్తామని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. రెండు వర్గాలు భారత జాతీయులైనప్పటికీ.. భారత్‌ వెలుపలి ఆర్బిట్రేషన్‌ను ఎంచుకునే స్వతంత్రతను ఎవరూ కాదనలేరని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లు కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ 1872లోని సెక్షన్‌ 23 ప్రకారం.. రెండు భారత వర్గాలు భారత్‌ వెలుపలి మధ్యవర్తిత్వానికి వెళ్లడం ఆ సెక్షన్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందన్న పిటిషనర్ల వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ప్రభుత్వానికి సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్ల కేటాయింపు!
దిల్లీ: ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్లు కేటాయించేందుకు అనుమతి తీసుకునే నిమిత్తం మే 18న అత్యవసర సమావేశాన్ని (ఈజీఎం) సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.4,800 కోట్ల మూలధనం అందించినందున, ఈ షేర్లను సెంట్రల్‌ బ్యాంక్‌ కేటాయించనుంది. ఈ నిధులను సెంట్రల్‌ బ్యాంక్‌కు విడుదల చేసేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దృశ్యమాధ్యమ విధానంలో ముంబయిలోని తమ ప్రధాన కార్యాలయంలో 18న ఈజీఎంను నిర్వహించనున్నట్లు ఎక్స్ఛేంజీకి సెంట్రల్‌ బ్యాంక్‌ తెలియజేసింది. రూ.10 ముఖ విలువ గల 2,80,53,76,972 ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.17.11 చొప్పున (మొత్తం విలువ రూ.4,800 కోట్లు) ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేటాయించేందుకు ఈ సమావేశంలో వాటాదార్ల అనుమతిని కోరనున్నామని పేర్కొంది. మూలధనాన్ని మరింత పెంచుకునేందుకు ఈక్విటీ షేర్ల జారీ, కేటాయింపుల ద్వారా మరిన్ని నిధులు సమీకరించాలని కూడా సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతిపాదించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని