ఐదో రోజూ ఆగని పెట్రో ధరల పరుగు! - Fuel prices hiked for fifth straight day
close

Updated : 13/02/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదో రోజూ ఆగని పెట్రో ధరల పరుగు!

దిల్లీ: చమురు ధరలు వరుసగా ఐదో రోజూ పెరిగాయి. దీంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్లైంది. దేశ రాజధాని దిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర 30 పైసలు పెరిగి రు.88.44కు చేరింది. లీటర్‌ డీజిల్‌పై 36 పైసలు పెరిగి రూ.78.74కి ఎగబాకింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నేటి పెంపుతో లీటరు పెట్రోలు రూ.94.93, డీజిల్ రూ.85.70కు చేరింది.

గత 44 రోజుల్లో చమురు ధరలు 17 సార్లు పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు గత కొన్ని రోజులుగా పోటాపోటీగా చుక్కలను తాకుతున్నాయి. దీంతో సామాన్యుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. నిత్యావసర ధరలు కొండెక్కడంతో కుటుంబంపై భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో చమురు సంస్థలు ఇక్కడా ధరలు పెంచుతున్నాయి.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 2.49 శాతం పెరుగుదలతో 62.66 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.54 శాతం పెరుగుదలతో 59.72 డాలర్లకు పెరిగింది.

ప్రధాన నగరాల్లో లీటరు ధర ఇలా...

నగరం     పెట్రోల్‌(రూ.లలో)      డీజిల్‌(రూ.లలో)

దిల్లీ             88.44            78.38
ముంబయి       94.93            81.38
కోల్‌కతా         89.73            81.96
చెన్నై            90.70            83.52
బెంగళూరు      91.40            83.47
హైదరాబాద్‌     91.96            85.89
జైపుర్‌          94.86            87.04

ఇవీ చదవండి...

పెట్రో మంటలకు కారణాలివే..!

పారిశ్రామికోత్పత్తి కళకళ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని