close

Published : 21/04/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.7.72 లక్షల కోట్ల సమీకరణ

ముంబయి: స్టాక్‌ మార్కెట్లో నమోదిత కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన బాండ్లు జారీ చేసి రూ.7.72 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమకూరిన నిధుల్లో ఇదే అత్యధికం. 2019-20లో రూ.6.75 లక్షల కోట్లు, 2018-19లో రూ.6.1 లక్షల కోట్లు, 2017-18లో 6.4 లక్షల కోట్లు పోగయ్యాయి.

బ్యాలెన్స్‌ షీట్ల బలోపేతంతో పాటు ప్రస్తుత అప్పుల భారం తగ్గించుకోవడం, నిర్వహణ పెట్టుబడుల అవసరాల కోసమే సంస్థలు ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా నిధులు సేకరించాయి. ఇతర ప్రత్యామ్నాయాలతో పోలిస్తే వడ్డీ భారం తక్కువగా ఉండడం వల్లే కంపెనీలు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నాయని గ్రో సంస్థ సీఓఓ హర్ష్‌ జైన్ తెలిపారు. మరోవైపు నిరర్థక ఆస్తులు పెరుగుతాయన్న భయంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ జారీకి వెనుకాడడం కూడా ఓ కారణమని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని