close

Updated : 17/04/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏరోసిటీని అభివృద్ధి చేస్తున్న జీఎంఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో ఏరోసిటీని అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్‌ గ్రూపు శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ఈ ప్రత్యేక బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది. మొత్తం 1500 ఎకరాల్లో వ్యాపారం, వినోదం, రిటైల్‌, ఆతిథ్యం, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ తదితర ముఖ్యమైన నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఏరోసిటీలో ఇప్పటికే ఉన్న జీఎంఆర్‌ బిజినెస్‌ పార్క్‌లో పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయని తెలిపింది. వీటికి నిరంతరాయంగా టెలికాం, విద్యుత్‌, ఐటీ విభాగాల్లో ఉత్తమ మౌలిక సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపింది. రక్షణ పరంగానూ పూర్తి సురక్షితంగా ఉండేలా మూడంచెల భద్రతా వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలని భావించే సంస్థలకు అనువైన అన్ని వసతులనూ ఏరోసిటీ కల్పిస్తుందని జీఎంఆర్‌ విమానాశ్రయం ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ సీఈఓ అమన్‌ కపూర్‌ తెలిపారు. దాదాపు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నాలుగు టవర్లలో ఒకటి ఇప్పటికే పూర్తి స్థాయిలో అద్దెకు వెళ్లిందని, రెండోది కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జీఎంఆర్‌ ఏరోసిటీ హైదరాబాద్‌లో భవిష్యత్తు బిజినెస్‌ కారిడార్‌గా మారుతుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని