GPT Healthcare IPO: ఐపీఓకి జీపీటీ హెల్త్‌కేర్ దరఖాస్తు! - GPT Healthcare files draft papers with Sebi to raise funds via IPO
close

Published : 18/10/2021 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GPT Healthcare IPO: ఐపీఓకి జీపీటీ హెల్త్‌కేర్ దరఖాస్తు!

దిల్లీ: ఐఎల్‌ఎస్‌ ఆసుపత్రులను నిర్వహిస్తోన్న జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఇష్యూలో రూ.17.5 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 2.98 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా జీపీటీ సన్స్‌ 38.05 లక్షల షేర్లు, బన్యన్‌ట్రీ గ్రోత్‌ క్యాపిటల్‌ II ఎల్‌ఎల్‌సీ 2.61 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వైద్యపరికరాల కొనుగోలు సహా ఇతర కార్పొరేట్‌ ప్రయోజనాలకు వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఐఎల్‌ఎస్‌ హాస్పిటల్స్ పేరిట జీపీటీ హెల్త్‌కేర్ మధ్యస్థాయి ఆసుపత్రులను నడుపుతోంది. సెప్టెంబరు 30 నాటికి 556 పడకల సామర్థ్యం గల నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. గైనకాలజీ, మేటర్నిటీ సర్వీసెస్‌, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, న్యూరో, కార్డియాక్‌ సైన్సెస్‌, సైకియాట్రీ... విభాగాల్లో ఈ సంస్థ ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు మంచి పేరుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని