GST వసూళ్లు.. ఆల్‌టైం రికార్డు  - GST Collections hit all time record
close

Updated : 01/05/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GST వసూళ్లు.. ఆల్‌టైం రికార్డు 

దిల్లీ: ఏప్రిల్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు సరికొత్త రికార్డును తాకాయి. కరోనా సంక్షోభ సమయంలోనూ భారీ మొత్తంలో వసూలయ్యాయి. గత నెలలో రూ. 1.41లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. వరుసగా ఏడో నెల వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటగా..  వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

ఏప్రిల్‌లో మొత్తంగా రూ. 1,41,384 కోట్ల జీఎస్‌టీ వసూలవ్వగా.. ఇందులో కేంద్ర జీఎస్‌టీ వాటా రూ. 27,837కోట్లుగా ఉందని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర జీఎస్‌టీ కింద రూ. 35,621 కోట్లు, సమీకృత జీఎస్‌టీ కింద రూ. 68,481 కోట్లు, సెస్‌ రూపంలో రూ. 9,445 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు వివరించింది. కరోనా రెండో దశ ఉద్ధృతితో గత నెల దేశవ్యాప్తంగా పలు చోట్ల లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమల్లోకి వచ్చి వ్యాపారాలపై ప్రభావం చూపిస్తున్నప్పటికీ.. దేశీయ వ్యాపారులు సరైన సమయంలో జీఎస్‌టీ బకాయిలు చెల్లించారని ఆర్థిక శాఖ పేర్కొంది. 



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని