జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు - GST Revenue collection for March 21 sets new record
close

Published : 01/04/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

దిల్లీ: మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత నెలలో 1,23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఆరు నెలలుగా రూ.లక్ష కోట్లు మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు.. తాజాగా సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చిలో వచ్చిన ఆదాయం కంటే ఇది 27శాతం అధికమని కేంద్రం తెలిపింది.

మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ.22,973కోట్లు కాగా.. స్టేట్‌ జీఎస్టీ రూ.29,329 కోట్లు సమకూరినట్టు కేంద్రం తెలిపింది. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూపంలో రూ.62,842కోట్లు రాగా.. సెస్సుల రూపంలో రూ.8,757 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది.  

గతేడాది మార్చితో పోలిస్తే రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లు ఇలా..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని