జీవిత బీమా పాల‌సీల‌పై జీఎస్‌టీ - GST-on-insurance-policies
close

Published : 24/12/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవిత బీమా పాల‌సీల‌పై జీఎస్‌టీ

వివిధ బీమా పాల‌సీల‌కు వేర్వేరు జీఎస్‌టీ రేట్లు వర్తిస్తాయి.. మనం చెల్లించే బీమా ప్రీమియంలలో ఇతర ఖర్చులతోపాటు , జీఎస్‌టీ కూడా ఉంటుంది. అయితే ఇవి ప్రకటనలలో కనిపించవు. వివిధ బీమా పాల‌సీల‌కు వేర్వేరు జీఎస్‌టీ రేట్లు వర్తిస్తాయి. టర్మ్ జీవిత బీమా పాలసీ చౌకగా లభిస్తుంది. ఇందులో మోర్టాలిటీ చార్జీలతోపాటు , 18శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.

ఉదా : మీరు చెల్లించే టర్మ్ జీవిత బీమా వార్షిక ప్రీమియం రూ. 5000 ఉంటే, అందులో రూ. 900 జీఎస్‌టీ ఉంటుంది.

ఒకవేళ దీనికి అదనంగా ప్రమాదం వల్ల‌ మరణం గానీ, అంగవైకల్యం వంటి రైడర్లను జోడిస్తే వీటిపై చెల్లించే ప్రీమియం లోకూడా 18 శాతం జీఎస్‌టీ ఉంటుంది. యులిప్స్ ఫై చెల్లించే ప్రీమియం లో కొంత మొత్తం బీమా ప్రీమియం గాను, మిగిలినది మదుపు కింద‌కి వ‌స్తుంది. మదుపు చేసే మొత్తంపై జీఎస్‌టీ వర్తించదు. బీమా ప్రీమియం , ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీల‌పై జీఎస్‌టీ వర్తిస్తుంది.

సంప్రదాయ పాలసీలైన ఎండోమెంట్, హోల్‌లైఫ్‌లో బీమాతో పాటు పెట్టుబ‌డి కూడా ఉంటుంది కాబట్టి , వీటిపై మొదటి ఏడాది 4.5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. తరువాతి ఏళ్లకు 2.25 శాతం వర్తిస్తుంది. ఉదా : వార్షిక ప్రీమియం రూ. 10 వేలు ఉంటె , మొదటి ఏడాది రూ. 450, ఆ తరువాత ఏడాదికి రూ. 225 జీఎస్‌టీ వర్తిస్తుంది.

పెన్షన్ ప్లాన్ లేదా యాన్యుటీ ప్లాన్ లలో ముందుగా లంప్‌స‌మ్‌ చెల్లించి, నెలవారీ లేదా వార్షిక ఆదాయం పొందుతాము . ఈ పథకాలపై జీఎస్‌టీ 1.8 శాతం వర్తిస్తుంది.
ఉదా: ముందుగా మీరు రూ. 10 లక్షలు చెల్లిస్తారు. తద్వారా వార్షికంగా రూ. 80 వేలు పొందుతారు. ఇలా చెల్లించిన రూ. 10 లక్షలపై చెల్లించే జీఎస్‌టీ రూ 18 వేలు.

మ్యూచువల్ ఫండ్ల‌పై కూడా జీఎస్‌టీ వర్తిస్తుంది. అయితే ఇవి వ్య‌య నిష్ప‌త్తిలో క‌లిపి ఉంటాయి. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన గరిష్ట పరిమితి 2.25 శాతంలోనే జీఎస్‌టీ కూడా ఉంటుంది. అదే ఎన్‌పీఎస్‌ లో జీఎస్‌టీ చాలా తక్కువ, ఎందుకంటే వీటి నిర్వహణా ఖర్చులు తక్కువ కాబట్టి. ఎన్‌పీఎస్‌ ద్వారా పొందే యాన్యుటీలపై జీఎస్‌టీ వర్తించదు.
పెట్టుబడి పెట్టే కొన్ని బీమా పథకాలలో , జీఎస్‌టీ వర్తింపు వలన దీర్ఘకాలంలో రాబడి తగ్గే అవకాశం ఉంటుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని