27న గ్లెన్మార్క్ఆత ఐపీఓ ప్రారంభం - Glenmark-Life-Science-IPO-price-band-set-at-Rs-695-720-per-share
close

Updated : 21/07/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

27న గ్లెన్మార్క్ఆత ఐపీఓ ప్రారంభం

ముంబయి: గ్లెన్మార్క్‌ లైఫ్‌ ఐపీఓ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27న మొదలయ్యే ఈ ఐపీఓ 29వరకు నడుస్తుంది. ఒక్కో షేరు ధరను ₹695- ₹720గా నిర్ణయించారు. ఈ ఇష్యూతో గ్లెన్మార్క్‌ ₹1513.60 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లెన్మార్క్ ఫార్మా ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ కింద 6.30 మిలియ‌న్ షేర్లను ఉంచుతోంది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ క్రియాశీల ఔష‌ధ ప‌దార్ధాల (ఏపీఐ) త‌యారీ వ్యాపారంలో ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలో 120 ఉత్ప‌త్తులున్నాయి.

గ్లెన్మార్క్‌ ఐపీఓ యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ బిడ్ జులై 26న ప్రారంభ‌మ‌వుతుంది. ఐపీఓను ఆగ‌స్టు 6న ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ చేస్తారు. గోల్డ్‌మ‌న్ సాచ్స్‌, కోట‌క్ మ‌హీంద్రా క్యాపిట‌ల్‌, బోఫా సెక్యూరిటీస్‌, డీఎమ్ క్యాపిట‌ల్‌, బోబ్ క్యాప్స్‌, ఎస్‌బీఐ క్యాపిట‌ల్ మార్కెట్స్ ఈ ఇష్యూకు ప్ర‌ధాన నిర్వాహ‌కులు. ₹900 కోట్ల విలువైన తాజా ఇష్యూ నుంచి వ‌చ్చే ఆదాయం `ఏపీఐ` వ్యాపారం స్పిన్‌-ఆఫ్, కొనుగోళ్ల కోసం ఉపయోగిస్తారు. మిగిలిన మొత్తం మూల‌ధ‌న వ్య‌య అవ‌స‌రాల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డానికి వినియోగిస్తారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని