ఐపీఓకు రానున్న గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌ - Glenmark Life Sciences plans IPO
close

Published : 17/04/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఓకు రానున్న గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్స్‌ ఐపీఓకు రాబోతోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో మొత్తం రూ.1,160 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు ప్రమోటర్లకు చెందిన 73.05 లక్షల షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. గ్లెన్‌మార్క్‌ ప్రమోటర్లుగా ఉన్న సల్దన్హా ఫ్యామిలీ ట్రస్ట్‌, ఎలిజెబెత్‌ సల్దన్హా, గ్లెన్‌ సల్దన్హా, చెరిలన్‌ పింటో తమ వాటాల్లోకి కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి, లాట్‌ సైజ్‌, సబ్‌స్క్రిప్షన్‌ తేదీ వంటి వివరాల్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. అయితే, మొత్తం రూ.2000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

ఔషధాల తయారీకి కావాల్సిన ‘యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌(ఏపీఐ)’ను గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉత్పత్తి చేస్తుంటుంది. మొత్తం 130 రకాల ఏపీఐలను వివిద సంస్థలకు సరఫరా చేస్తోంది. ఇక ఈ సంస్థ పేరిట పేటెంట్‌ కలిగిన 270 ఆవిష్కరణలు ఉన్నాయి. మొత్తం 65 దేశాల్లోని 700 కంపెనీలకు ఈ సంస్థ తమ ఉత్పత్తుల్ని సరఫరా చేస్తోంది. ఏటా 10-12 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం ఈ సంస్థ ప్రత్యేకత. గుజరాత్‌లోని అంకలేశ్వర్‌, దహెజ్‌, మహారాష్ట్రలోని కురుకుంభ్‌లో తయారీ కేంద్రాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో 29.78 శాతం ఎబిటా మార్జిన్‌ నమోదు చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని