బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ప‌న్ను - Gold-and-Real-Estate-Tax
close

Published : 17/02/2021 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ప‌న్ను

బంగారం స్థిరాస్తి పెట్టుబ‌డులు సాంప్ర‌దాయ పెట్టుబ‌డులుగా పేరొందాయి. వీటిలో పెట్టుబ‌డుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎక్కువ‌. రిస్క్ త‌క్కువ‌, రాబ‌డి హామీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఈ పెట్టుబ‌డుల‌పై మొగ్గుచూపుతారు. దీంతోపాటు ఇళ్లు  లేదా బంగారం ఉండ‌టం కూడా భార‌తీయుల‌కు ఒక సెంటిమెంట్. అయితే కొన్ని సంవ‌త్స‌రాలుగా రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డుల‌పై లాభాలు క్షీణించాయి. మ‌రోవైపు బంగారం గ‌త సంవ‌త్స‌రం సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో అనుకున్నంత సానుకూల‌త క‌న‌బ‌డ‌లేదు. లావాదేవీల వ్య‌యం కూడా చాలాఉ ఎక్కువ‌. అయితే అవ‌స‌రం ఉన్నంత కాకుండా పెట్టుబ‌డుల కోసం రియ‌ల్ ఎస్టేట్‌, బంగారం పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇప్పుడే బంగారం లేదా స్థిరాస్తి పెట్టుబ‌డుల‌ నుంచి ఉప‌సంహ‌రించుకుంటే మీకు వ‌ర్తించే రేట్లు గురించి ముందు తెలుసుకోండి

బంగారం:
* మూడు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువగా ఉంటే దీర్ఘ‌కాలికంగా ప‌రిగ‌ణిస్తారు
* స్వ‌ల్ప‌కాలిక ప‌న్ను- శ్లాబు రేటు ప్ర‌కారం
* దీర్ఘ‌కాలిక ప‌న్ను- ఇండెక్సేష‌న్‌తో క‌లిపి 20.8 శాతం 
 సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు:
 * లిస్ట్ అయితే 1 సంవ‌త్స‌రాన్ని దీర్ఘ‌కాలికంగా భావిస్తారు
* లిస్ట్ కాక‌పోతే 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణిస్తారు
* వడ్డీపై శ్లాబు రేటు ప్ర‌కారం ప‌న్ను
* స్వ‌ల్ప‌కాలిక ప‌న్ను: శ్లాబు రేటు ప్ర‌కారం
* దీర్ఘ‌కాలిక ప‌న్ను: ఇండెక్సేష‌న‌తో క‌లిపి 20.8 శాతం (  మెచ్యూరిటీకి ముందు ట్రాన్స్ఫ‌ర్ చేసిన అన్‌లిస్టెడ్ బాండ్లు, లిస్టెడ్ బాండ్లు), మెచ్యూరిటీ స‌మ‌యంలో ఎటువంటి ప‌న్ను ఉండ‌దు
రియ‌ల్ ఎస్టేట్:

* రెండు సంవ‌త్సరాల కంటే ఎక్కువ ఉంటే దీర్ఘ‌కాలిక ప‌న్ను
* స్వ‌ల్ప‌కాలిక ప‌న్ను- శ్లాబు రేటు ప్ర‌కారం
* దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ప‌న్ను - ఇండెక్సేష‌న్‌తో క‌లిపి 20.8 శాతం

 లిస్టెడ్ గోల్డ్ బాండ్లు ఏడాది త‌ర్వాత‌ సెకండ‌రీ మార్కెట్లో విక్ర‌యిస్తే  10.4 శాతం ప‌న్ను , ఇందులో సెస్ కూడా క‌లిపి ఉంటుంది.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని