Gold Rate Today: పెరిగిన బంగారం ధర - Gold and silver gain on strong global trends
close

Updated : 17/05/2021 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Rate Today: పెరిగిన బంగారం ధర

న్యూదిల్లీ: కరోనా కారణంగా అక్షయ తృతీయ వేళ పసిడి అమ్మకాలు వెలవెలబోయిన సంగతి తెలిసిందే. కాగా, దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో సోమవారం 10 గ్రాముల బంగార ధర రూ.348 పెరిగి రూ.47,547కు చేరింది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ పెరగడమే ఈ పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు వెండి కూడా కిలో రూ.936 పెరిగి 71,310కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 1,853 డాలర్లు ఉండగా, వెండి 27.70 డాలర్లు ఉంది. యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌లో తగ్గుదల ఉండటంతో బంగారం ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. డాలర్‌ బలహీన పడటం, యూఎస్‌ ఈల్డ్స్‌ తగ్గుదల, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీన పడటం వంటి కారణాలతో పసిడి ధరలు పెరిగి,మూడు నెలల గరిష్టానికి చేరాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ కమొడటీస్‌ ఉపాధ్యక్షుడు నవనీత్‌ దమానీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం రూ.49,650(అన్ని పన్నులతో కలిపి)గా ట్రేడ్‌ అవుతోంది. అంతకు ముందు రూ.48,980 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని