Gold Rate: పెరిగిన బంగారం ధర - Gold and silver rally reflecting global recover
close

Updated : 06/05/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Rate: పెరిగిన బంగారం ధర

న్యూదిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.439 పెరిగి రూ.46,680గా నమోదైంది. అలాగే వెండి కూడా కిలో రూ.1,302 పెరిగి 69,511కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలకు మద్దతు లభించడంతో దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ తెలిపింది.

అంతర్జాతీయంగా బంగార ధర ఔన్సు 1,792 డాలర్లుగా ఉంది. వెండి ధర రూ.26.72 డాలర్ల ఉండటం గమనార్హం. డాలర్‌ బలహీనపడంతో మదుపరులు సైతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపడం పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది. ఇక హైదరాబాద్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.48,530 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బుధవారం బులియన్‌ ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూ.48,220గా నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని