మరింత తగ్గిన పసిడి ధర - Gold declines Rs 480 silver tumbles Rs 3097
close

Published : 02/02/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరింత తగ్గిన పసిడి ధర

అదే బాటలో వెండి కూడా

దిల్లీ: బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించడంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం పసిడి ధర రూ. 480 తగ్గడంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పుత్తడి రూ. 47,702 పలికింది. క్రితం సెషన్‌ ముగింపు సమయానికి ఈ ధర రూ. 48,182గా ఉంది. కాగా.. సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. ఇక వెండి కూడా నేడు పసిడి దారిలోనే పయనించింది. రూ. 3,097 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 70,122కు పడిపోయింది.  

అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. దీంతో పాటు బడ్జెట్‌లో ఈ లోహలపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో దేశీయ విపణి బంగారం, వెండి ధరలు దిగొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. 

అధిక పన్నుభారం వల్ల దేశంలో బంగారం స్మగ్లింగ్‌ పెరిగిన నేపథ్యంలో ఈ అక్రమాలను అరికట్టడంతో పాటు, రత్నాభరణాల ఎగుమతులకు ఊతమిచ్చేందుకు గానూ బంగారం, వెండి ధరలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం వీటిపై 12.5శాతం కస్టమ్స్‌ సుంకం ఉండగా.. దీన్ని 7.5శాతానికి తగ్గించారు. 

ఇవీ చదవండి..

దలాల్‌ స్ట్రీట్‌లో బడ్జెట్‌ కళ..

మీ ఇల్లు బంగారంగానూ..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని