వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర - Gold declines for fourth consecutive trade
close

Updated : 04/02/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర

దిల్లీ: దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పసిడి ధర తగ్గుముఖం పట్టింది. గురువారం రూ.322 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన(24 క్యారెట్లు) పుత్తడి రూ. 47,135 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 68వేల దిగువకు పడిపోయింది. రూ. 972 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 67,170గా ఉంది. 

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి బలపడటంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1825 డాలర్లు, ఔన్సు వెండి 26.61డాలర్లు పలికింది. 

ఇవీ చదవండి..

ఎన్‌బీఐ నికరలాభం తగ్గింది..!

అమెజాన్‌ సీఈఓ ఆండీ జాస్సీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని