close
Array ( ) 1

తాజా వార్తలు

యూపీలో 3000 టన్నుల బంగారు గనులు

సోన్‌భద్ర (ఉత్తర్‌ ప్రదేశ్‌): ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోన్‌పహాడీలో 2700 టన్నులు, హార్దీలో 650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ నిక్షేపాలను తవ్వితీసే మైనింగ్‌ కార్యక్రమాన్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సర్వే కొనసాగుతోంది. ఈ-టెండరింగ్‌ ద్వారా వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.  కాగా ఇక్కడ బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.