బంగారంలో పెట్టుబ‌డుల‌తో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు - Gold-investment-can-be-more-than-a-hedge-against-inflation
close

Published : 29/06/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారంలో పెట్టుబ‌డుల‌తో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు

సాధార‌ణంగా మ‌దుపరులు చేసే త‌ప్పు  ద్రవ్యోల్బణాన్ని అదిగ‌మించ‌లేని పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం. దీంతో మీరు ఆదా చేసిన మొత్తం ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి అప్పుడున్న వ్య‌యాల‌కు స‌రిపోయేంత డ‌బ్బు ఆదా కాక‌క‌పోవ‌చ్చు.  ప్రంపంచంలోని ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్నందున భార‌త్‌లో కూడా ద్ర‌వ్యోల్బ‌ణం భ‌విష్య‌త్తులో మ‌రింత పెరుగుతంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడే రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకొని పెట్టుబ‌డుల‌ను ప్రారంభించాలి.
ఇత‌ర పెట్టుబ‌డుల‌తో పోలిస్తే బంగారాన్ని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జ్‌గా పరిగణిస్తారు. ఇది  దీర్ఘకాలికంగా, బంగారం ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని ఇస్తుంది. ఆర్‌బీఐ కూడా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ప్రాతినిధ్యం వహిస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం  2022 ఆర్థిక సంవ‌త్స‌రానికి 5 శాతానికి పైనే ఉంటుందని అంచనా వేసింది. మీరు బంగారం పెట్టుబ‌డుల్లో కేటాయింపును పెంచుకుంటే, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారం ఎలా పని చేస్తుందో, ఇందులో పెట్టుబ‌డులు పెంచాలా వద్దా అని అర్థం చేసుకుందాం.
 గత 30 సంవత్సరాల్లో  బంగారం పెట్టుబ‌డుల‌పై 10 శాతం వార్షిక రాబడిని అందించింది. గత దశాబ్దంలో, బంగారం నుంచి వార్షిక రాబడి 11 శాతం. అదే కాలంలో, సీపీఐ సూచిక 6.3 శాతానికి పెరిగింది. అందువల్ల, బంగారంపై దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు ద్ర‌వ్యోల్బ‌ణానికి వ్య‌తిరేకంగా హెడ్జ్‌గా ప‌నిచేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.
 
బంగారం సురక్షితమైన పెట్టుబ‌డిగా పరిగణించబడుతుంది. ఈక్విటీ పెట్టుబ‌డుల్లో అస్థిర‌త ఏర్ప‌డిన‌ప్పుడు బంగారంలో లాభాలు క‌నిపిస్తాయి. 
ఉదాహరణకు, 2001 సంవ‌త్స‌రంలో నీఫ్టీ 50 సూచీ 18 శాతం దిగువ‌కు చేరితే, బంగారం 6 శాతం సానుకూల రాబడిని ఇచ్చింది. అదేవిథంగా 2008 సంవ‌త్స‌రంలో, ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో, నిఫ్టీ 52 శాతం న‌ష్ట‌పోతే, బంగారం 26 శాతం సానుకూలంగా ఉంది.
ఈ మధ్యకాలంలో, 2018 ప్రారంభం నుంచి 2020 చివరి వరకు (మూడు సంవత్సరాలు), నిఫ్టీ 50 చాలా ఎక్కువ అస్థిరతను చూసింది, 10 శాతం సీఏజీఆర్‌ను న‌మోదుచేయ‌గా, అదే సమయంలో బంగారం 19 శాతం సీఏజీఆర్‌ను న‌మోదుచేసింది.
అయితే, బంగారం ఒక‌ అస్థిర ఆస్తి. ఇందులో ఒకేసారి ఎక్కుగా అవ‌క‌త‌వ‌కలు ఏర్ప‌డే అవ‌కాశం త‌క్కువ‌.  కానీ బంగారం పెట్టుబ‌డుల వ్య‌వ‌ధి  కనీసం మూడేళ్ళు ఉండాలి. దీనిని వ్యూహాత్మక కేటాయింపుగా పరిగణించాలి.
మీరు మీ కేటాయింపును పెంచాలా?
 బంగారం పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో భాగం కావాలి, అది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జ్ ఇవ్వగలిగిందా లేదా అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే మీ పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం బంగారం పెట్టుబ‌డుల‌కు కేటాయించాల‌ని నిపుణులు  సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం రూపాయి విలువ‌ను త‌గ్గించి, డాలర్ కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. అందుకే బంగారాన్ని సాధారణంగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జ్‌గా చూస్తారు. 
 అయితే కేవ‌లం బంగారంలో పెట్టుబ‌డుల‌ను హెడ్జింగ్ ప్రాతిపాదిక‌న చేయ‌కూడ‌దు. ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగినా, పెర‌గ‌క‌పోయినా దీన్ని ఒక దీర్ఘ‌కాల పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాలి. ఎందుకంటే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌క్క‌న పెడితే ఇప్పుడు ఊహించ‌కుండా వ‌చ్చిన క‌రోనా మ‌హ‌మ్మారి వంటి సంక్షోభ ప‌రిస్థితుల్లో ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ‌తిన‌కుండా ఈ పెట్టుబ‌డులు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని