Gold Rate: పెరిగిన బంగారం.. వెండి ధరలు - Gold jumps Rs 310 silver rises Rs 580
close

Published : 03/05/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Rate: పెరిగిన బంగారం.. వెండి ధరలు

న్యూదిల్లీ: సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.310 పెరిగి 46,580కి చేరిందని పీటీఐ పేర్కొంది. అంతర్జాతీయంగా బంగారంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధర పెరుగుదలకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.580 పెరగడంతో రూ.67,429కి చేరింది.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు తగ్గి 74.33గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సు 1,777 డాలర్ల కాగా, వెండి ఔన్సు 26.06 డాలర్లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.48,410 (పన్నులతో కలిపి)గా ఉండగా.. వెండి కిలో రూ.70,829గా ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని