close

Updated : 26/02/2021 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంగారం మీద రుణాల వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత‌?

రుణం తీసుకోవ‌డానికి బంగారం త‌న‌ఖా పెట్ట‌డం.. ఇది పాత కాలం నుంచి జ‌రుగుతున్న విష‌య‌మే. బంగారు రుణాలు మ‌న దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫైనాన్సింగ్ సౌక‌ర్యాల‌లో ఒక‌టి. బ్యాంకుల నుండి రుణం కావాల‌న్న బంగారం త‌న‌ఖా పెట్టి రుణం తీసుకోవ‌చ్చు.  బంగారం తాక‌ట్టు పెట్టి రుణం తీసుకునేట‌ప్పుడు క్రెడిట్ స్కోర్ త‌క్కువున్నా ఇబ్బందేమీ లేదు. బంగారంతో రుణాల వ‌డ్డీ.. ప‌ర్స‌న‌ల్ లోన్ వ‌డ్డీకంటే త‌క్కువే ఉంటుంది. అత్య‌వ‌స‌ర రుణం కోసం బంగారంతో రుణం పొంద‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌మే సుల‌భ‌మైన మార్గం. బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా రుణ మంజూరు చేస్తాయి. 

కోవిడ్-19 కార‌ణంగా ప్ర‌జ‌లు ఆర్థిక అవ‌స‌రాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో  గ‌త ఏడాది ఆగ‌స్టులో ఆర్‌బీఐ వ్య‌వ‌సాయేత‌ర ప్ర‌యోజ‌నాల కోసం బంగారం విలువ‌లో 75% నుండి 90% దాకా రుణం పెంచాల‌ని ప్ర‌క‌టించింది. ఈ మార్పు మ‌ర్చి 31, 2021 వ‌ర‌కు చెల్లుతుంది.

బంగారు రుణాల‌కి బ్యాంక్‌కి, బ్యాంక్‌కి వ‌డ్డీ రేట్లు మారుతుంటాయి. వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజ‌ర్ మ‌రియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆల‌స్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధ‌ర‌ఖాస్తు సౌల‌భ్యం మొద‌లైన వాటి కోసం త‌నిఖీ చేసుకోవాలి.

దేశంలోని కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) సంస్థ‌లు ప్ర‌స్తుతం అందిస్తున్న బంగారు రుణాల‌పై అమ‌లు చేసే వ‌డ్డీ రేట్లు ఈ క్రింది టేబుల్‌లో ఉన్నాయి.

3 సంవ‌త్స‌రాల కాలానికి, రూ. 5 ల‌క్ష‌లు రుణానికి సూచించే టేబుల్‌.

2020 అక్టోబ‌ర్ నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కు బ్యాంక్స్ డేటా నుండి.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని