భారీగా తగ్గిన బంగారం ధర   - Gold plunges Rs 717 silver declines Rs 1274
close

Published : 17/02/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీగా తగ్గిన బంగారం ధర 

రూ.69వేల దిగువకు వెండి

దిల్లీ: దేశీయ మార్కెట్లో పసిడి ధర దిగొస్తోంది. బుధవారం ఒక్క రోజే రూ. 717 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 46,102కి పడిపోయింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ. 46,819గా ఉంది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే పయనిస్తోంది. నేడు రూ. 1,274 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 68,239 పలికింది. 

అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా నగల వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి గిరాకీ లేకపోవడంతో దేశీయంగా ఈ లోహాల ధరలు పడిపోయినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,786 డాలర్లు, ఔన్సు వెండి ధర 27.10 డాలర్లుగా ఉంది. పసిడిపై కస్టమ్స్‌ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. 

ఇవీ చదవండి..

స్టాక్‌ మార్కెట్‌.. రోజంతా నష్టాల్లోనే

ఒక్క మిస్డ్‌ కాల్‌తో ఎస్‌బీఐ వ్యక్తిగత లోన్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని