Today Gold Rate: పెరిగిన పసిడి ధర - Gold rallies Rs 527 silver zooms Rs 1043
close

Updated : 26/05/2021 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Today Gold Rate: పెరిగిన పసిడి ధర

న్యూదిల్లీ: బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.527 పెరిగి, రూ.48,589కు చేరింది. నిన్న 10గ్రాములు రూ.48,062 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.1,043 పెరగడం ద్వారా రూ.71,775కు చేరింది.

ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ ఏర్పడింది. ఔన్సు 1,908 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 28.07 డాలర్లుగా ఉంది. ‘డాలర్‌ సూచీ ఐదు నెలల కనిష్ఠానికి పడిపోవడం, యూఎస్‌ 10-ఇయర్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.56శాతం తగ్గడంతో మదుపరులు పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50,700(అన్ని పన్నులతో కలిపి)లకు పైగా ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని