Gold Rate: తగ్గిన బంగారం ధర - Gold silver decline amid muted global trends
close

Published : 03/06/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Rate: తగ్గిన బంగారం ధర

దిల్లీ: ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు దిగి వస్తున్నాయి. గురువారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.339లు తగ్గి 48,530కి చేరింది. గత ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 48,869వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు తగ్గడం వల్లే ఈ తగ్గుదల నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. 

మరోవైపు, వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై రూ.475లు తగ్గడంతో ప్రస్తుతం రూ.70,772గా ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో కిలో వెండి 71,247వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1893డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండిధర 27.79డాలర్లుగా ఉంది.  మరోవైపు, హైదరాబాద్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50500 (అన్ని పన్నులతో కలిపి)లకు పైగా ట్రేడవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని