పసిడి పడింది‌.. వెండి పెరిగింది - Gold tanks Rs 1324 silver jumps Rs 3461
close

Updated : 01/02/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి పడింది‌.. వెండి పెరిగింది

దిల్లీ: బడ్జెట్‌ ప్రకటన వేళ దేశీయ మార్కెట్లో బంగారం ధర అమాంతం పడిపోయింది. సోమవారం ఒక్కరోజే రూ. 1,324 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ. 47,520గా ఉంది. అయితే ఇదే సమయంలో వెండి ధర భారీగా పెరగడం గమనార్హం. దీంతో కేజీ వెండి ధర రూ.70వేల మార్క్‌ను దాటింది. బులియన్‌ మార్కెట్లో నేడు కేజీ వెండి ధర రూ. 3,461 పెరిగి రూ. 72470 పలికింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేసిన రోజే ఈ లోహాల ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం గమనార్హం. 

2019 జులైలో బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతం నుంచి 12.5శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ తర్వాత ఈ లోహాల ధరలు పెరిగాయి. అయితే ఇటీవల బంగారం, వెండి ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై కస్టమ్స్‌ సుంకాన్ని హేతుబద్ధీకరిస్తామని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. తాజా నిర్ణయంతో దేశీయ విపణీలో ఈ లోహాల ధరలు తగ్గడంతో పాటు రంగురాళ్లు, ఆభరణాల ఎగుమతులు పెరిగే అవకాశముందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవీ చదవండి..

మన బుల్‌ కుదురుకుంది.. కుమ్మేసింది..!

‘ఆరోగ్య’మస్తు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని