రూ. 47వేలకు చేరిన బంగారం - Gold tumbles Rs 679 silver crashes Rs 1847
close

Updated : 02/03/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ. 47వేలకు చేరిన బంగారం

దిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న బంగారం ధర మంగళవారం భారీగా దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే సుమారు రూ.700 తగ్గి రూ.47,000(10గ్రాములు) మార్క్‌కు చేరుకుంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. రూ. 500 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 69,500 పలికింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47,050గా నమోదైంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,719 డాలర్లు, ఔన్సు వెండి ధర 26.08గా ఉంది.

ఇవీ చదవండి.. 

రెండో రోజూ.. లాభాల్లోనే

ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని